ఇక ఇప్పటి వరకు అమెరికాలో మొత్తం 6,14,246 మంది వైరస్ సోకింది. వైరస్‌పై పోరులో క్రమంగా పురోగతి సాధిస్తున్నామని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆశాభావం వ్యక్తం చేశారు. కంటికి కనపడి శత్రువుతో పోరాడి మరణించిన వారి త్యాగాలను వృథా పోనివ్వమని, కటిక చీకట్లలోనూ వెలుగు రేఖలు విచ్చుకుంటున్నాయని వ్యాఖ్యానించారు. పరోక్షంగా పలు ప్రాంతాల్లో వైరస్ కేసుల సంఖ్య తగ్గుతుండడాన్ని ప్రస్తావించారు. ప్రపంచంలో ఇతర దేశాలతో పోలిస్తే అమెరికాలోనే అత్యధిక తలసరి ఐసీయూలు ఉన్నాయని తెలిపారు. అలాగే 16,000 వెంటిలేటర్లు ఉన్నాయని పేర్కొన్నారు.
ఓ సొరంగం చివరిలో కాంతి రేఖ కనబడుతోంది… గతంలో ఎన్నడూ లేనంతగా ఆ వెలుగు విచ్చుకుంటోంది. ప్రారంభంలో కంటే చాలా బలంగా, శక్తివంతంగా ఉన్నామని ట్రంప్ అన్నారు. ప్రతి లక్షలో 34.7 శాతం మందికి ఐసీయూ సదుపాయం.. ఇటలీలో ఇది 12.5 శాతం, ఫ్రాన్స్‌లో 11.6 శాతం, స్పెయిన్‌లో 9.7 శాతంగా ఉందన్నారు.
బాధితుల లాలాజలంతో పరీక్షించే విధానాన్ని రట్‌గర్స్ యూనివర్సిటీ అభివృద్ధి చేసిందని ట్రంప్ వెల్లడించారు. ఈ విధానం ద్వారా రోగులు తమను తామే పరీక్షోంచుకోవచ్చని, తద్వారా వైద్య సిబ్బంది వైరస్ బారినపడకుండా ఇది దోహదం చేస్తుందన్నారు. రట్గర్స్ అభివృద్ధి చేసిన విధానంతో రోజుకు 10వేల మందిని పరీక్షించవచ్చని వివరించారు.
మరోవైపు, రాష్ట్రాల్లో కొనసాగుతున్న షట్‌డౌన్‌ను ఎత్తివేసే నిర్ణయం విషయంలో ట్రంప్ కాస్త వెనక్కి తగ్గినట్లు సమాచారం. ఆయా రాష్ట్రాల్లో ఆర్థిక వ్యవస్థలను తెరిచే నిర్ణయాన్ని గవర్నర్లకే వదిలేస్తున్నానని వ్యాఖ్యానించారు. పటిష్ఠమైన పునుద్ధరణ పథకంతో రాష్ట్రాలు ఆంక్షలు ఎత్తివేయోచ్చని స్పష్టం చేశారు.