గుజరాత్ సీఎంతో భేటీ అయిన ఎమ్మెల్యేకి కరోనా

విశ్వమంతా కరోనా మహమ్మారి తీవ్రంగా విరుచుకుపడుతుంది. దీంతో ప్రతి దేశం లాక్ డౌన్ లోకి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే తాజాగా మలిదశ లాక్ డౌన్ లోకి వెళ్లింది ఇండియా. ప్రధాని మోడీ తాజా ప్రతిపాధన మేరకు ఇండియాలో లాక్ డౌన్ కొనసాగుతుంది. అయితే కరోనా ల‌క్ష‌ణాలు ఉన్న ఓ ఎమ్మెల్యే ముఖ్య‌మంత్రితో పాటు ఇత‌ర మంత్రుల‌ను కలవడం తీవ్ర కలకలం రేపుతుంది. ఆ తర్వాత కాసేప‌టికే అత‌నికి క‌రోనా పాజిటివ్ అని తేల‌డంతో అధికారులు షాక్ కి గురౌతున్నారు. ఈ ఘ‌ట‌న తాజాగా గుజ‌రాత్‌లో చోటు చేసుకుంది.

అయితే కాంగ్రెస్ ఎమ్మెల్యే ఇమ్రాన్ ఖేద్వాలా అహ్మ‌దాబాద్‌లోని జ‌మ‌ల్‌పూర్ ఖాదియా నుంచి ప్రాతినిధ్యం వ‌హిస్తున్నారు. మంగ‌ళ‌వారం మ‌ధ్యాహ్నం ఒంటి గంట ప్రాంతంలో ఆయ‌న గ్యాసుద్దీన్ షైఖ్‌, శైలేష్ పార్మ‌ర్ అనే మ‌రో ఇద్ద‌రు కాంగ్రెస్ ఎమ్మెల్యేల‌తో క‌లిసి గాంధీన‌గ‌ర్‌లోని సీఎం కార్యాల‌యంలో ముఖ్య‌మంత్రి విజ‌య్ రూపానీతో కీలక సమావేశం నిర్వహించారు. ఈ స‌మావేశానికి రాష్ట్ర ఉపముఖ్య‌మంత్రి నితిన్ ప‌టేల్‌, హోంమంత్రి ప్ర‌దీప్ సిన్హా జ‌డేజా ఇత‌ర అధికారులు కూడా హాజరయ్యారు.అయితే రాత్రి స‌మ‌యంలో ఎమ్మెల్యే ఇమ్రాన్‌కు క‌రోనా పాజిటివ్ అని నిర్ధార‌ణ అయింది.

అయితే ఈ స‌మావేశంలో ప్ర‌తి ఒక్క‌రు‌ సామాజిక దూరం పాటించార‌ని అధికారులు వెల్లడించారు. అంతేకాకుండా మాస్కులు కూడా తీసేసి క‌నిపించార‌ని ప‌లువురు పేర్కొనడం వైరల్ అవుతోంది. కాగా వీడియో కాన్ఫ‌రెన్స్ ద్వారా కాకుండా ప్ర‌త్య‌క్షంగా భేటీ అవ‌డంపై తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తమౌతుంది. అంతేకాకుండా గ‌త రెండు రోజుల నుంచి క‌రోనా ల‌క్ష‌ణాలు ఉన్న వ్య‌క్తిని సీఎంతో భేటీకి ఎలా అనుమ‌తించార‌ని స‌ర్వ‌త్రా విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. కాగా గుజ‌రాత్‌లో ఇప్ప‌టివ‌ర‌కు 617 కేసులు న‌మోద‌ కాగా 26 మంది మృతి చెందారు. మరి ఇప్పుడు గుజరాత్ ముఖ్యమంత్రికి, ఇతర మంత్రులకు కోరనా టెస్ట్ లు నిర్వహించాల్సిన అవసరం ఉంది.