కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి కి సికింద్రాబాద్ కోర్టుకు నుండి ఊరట కలిగింది. కొద్దీ రోజుల క్రితం మానవ అక్రమ రవాణా కేసు లో జగ్గా రెడ్డి ని పోలీసులు అరెస్ట్ చేసిన విషయం అందరికి తెలిసిందే. అయితే ఇప్పుడు అదే కేసు నుండి సికింద్రాబాద్ కోర్టు తనకు షరతులతో కూడిన బెయిల్ ను మంజూరు చేసింది. 50 వేల రూపాయిల పూచీకత్తుతో తో కూడిన బెయిల్ ని మంజూరు చేసింది.
సెప్టెంబర్ 11 న టాస్క్ ఫోర్స్ పోలీస్ లు జగ్గారెడ్డి ని అరెస్ట్ చేసారు. 2004 లో నకిలీ పాస్ పోర్ట్ లు మానవ అక్రమ రవాణా చేస్తున్నారన్న ఆరోపణలు పై తానని సెక్షన్ 8 క్రింద అరెస్ట్ చేసారు. మూగ్గురు వ్యక్తులని గుజరాతి వ్యక్తులుగా చిత్రీకరించి వారిని అమెరికా తీసుకువెళ్లి వొదిలినట్టు అయినా పై ఆరోపణలు వొచ్చాయి. అయితే ఈయన అరెస్ట్ పై తీవ్ర విమర్శలు వెల్లువడ్డాయి. ప్రభుత్వం కేవలం కక్షయ సాధింపు చర్య భాగంగానే జగ్గారెడ్డి పై కేసు లు పెట్టి అరెస్ట్ చేయించాయి కాంగ్రెస్ పార్టీ నేతలు తీవ్ర ఆరోపణలు చేసాయి. గతం లో 20 06 మరియు 2007 లో కేసు లు నమోదు అయినపుడు పోలీస్ లు ఎందుకు అరెస్ట్ చెయ్యలేదని ఆరోపణలు చేసారు.
అయితే ఇవే కేసుల పై జగ్గారెడ్డి తరుపు న్యాయవాదులు బెయిల్ పిటిషన్ వెయ్యడం జరిగింది దానికి కోర్టు షరతులు తో కూడిన బెయిల్ ను మంజూరు చెయ్యడం జరిగింది. ఈ రోజు చంచల్ గూడ జైలు నుండి జగ్గారెడ్డి విడుదల కానున్నారు. ఒకవేళ జగ్గారెడ్డి జైలు నుండి విడుదల కాకపోతే అతని సతీమణి నిర్మలను పార్టీ అభ్యర్థిగా ప్రకటించాలని కాంగ్రెస్ భావించింది. ఇప్పుడు అయినా విడుదల అయ్యారు కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. సినీ నటుడు పవన్ కళ్యాణ్ కి జగ్గారెడ్డి అత్యంత సన్నిహితుడు అన్న విషయం అందరికి విధేతమే.