Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
సోషల్ మీడియా వచ్చిన తర్వాత నెట్ లో ప్రతీది వైరల్ గా మారుతోంది. కాస్త విభిన్నం అనిపిస్తే చాలు… దాన్ని వైరల్ చేసేస్తున్నారు నెటిజన్లు. రాజకీయనాయకుల విషయాలయితే ఇక చెప్పాల్సిన పనే లేదు. వారికి వ్యతిరేకంగా ప్రచారం చేయడానికో లేదంటే… వారి గురించి వెటకారంగా మాట్లాడటానికో. తెగ ఉత్సాహం చూపిస్తున్నారు. అందుకే ప్రస్తుతం ప్రపంచంలో చాలా మంది రాజకీయ నాయకులు సోషల్ మీడియా బాధితులుగా మారుతున్నారు. ఆ జాబితాలో ముందువరుసలో ఉన్న వ్యక్తి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. ఆయన్ను విమర్శించడానికి కొత్త కొత్త పద్ధతులు వెతుకుతున్నారు నెటిజన్లు. అలా ఇప్పుడో ఫొటో నెట్ లో సెన్సేషన్ గా మారింది. కుక్క చెవిలో ట్రంప్ ముఖం కనిపిస్తుందంటూ ఓ ఫొటోను షేర్ చేస్తున్నారు అమెరికన్లు. వివరాల్లోకి వెళ్తే…
అమెరికాకు చెందిన జేడ్ రాబిన్ సన్ కు చీఫ్ అనే పెంపుడు కుక్క ఉంది. ఆ కుక్కకు చెవిలో ఇన్ ఫెక్షన్ వచ్చింది. చెవిని ఫొటో తీసి జేడ్ వెటర్నరీ డాక్టర్ కు పంపించింది. ఆ ఫొటోను జేడ్ తన స్నేహితురాలికి కూడా చూపించింది. ఆమె కుక్క చెవిలోపలి భాగం ట్రంప్ ఆకారాన్ని పోలిఉండటానని గమనించి స్నేహితురాలికి చెప్పింది. దీంతో జేడ్ ఆ ఫొటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. అలా ఈ ఫొటో నెట్ లో వైరల్ గా మారింది. దీనిపై నెటిజన్లు రకరకాలుగా కామెంట్ చేస్తున్నారు. కుక్కకు ట్రంప్ వ్యాధి, పాపం చీఫ్ అంటూ హాస్కోక్తులు కురిపిస్తున్నారు. మొత్తానికి ట్రంప్ ను వ్యతిరేకించే అమెరికన్లు ఆయన మీద తమకున్న కసిని ఇలా సోషల్ మీడియాలో తీర్చుకుంటున్నారు.