కృష్ణాజిల్లా అవనిగడ్డ నియోజకవర్గంలోని మోపిదేవి మండలం కే కొత్తపాలెం గ్రామంలో అమానుషం జరిగింది. ముగ్గురు ఎస్టీ మహిళలపై ఓ యజమాని పైశాచిక దాడికి దిగాడు. రెండు రోజులు బందీలుగానే బాధితులు ప్రాణం గుప్పెట్లో పెట్టుకుని కాలం వెళ్లదీశారు. తాము తప్పు చేయలేదని పోలీసులకు చెబుదామన్నా. మోపిదేవి ఎస్ఐ తమ గోడు వినలేదని బాధితులు ఆవేదన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తీవ్ర గాయాలతో అర్ధరాత్రి ప్రభుత్వ ఆసుపత్రి దగ్గర దయనీయ స్థితిలో బాధితులు ఉన్నారు. మోపిదేవి మండలంకే కొత్తపాలెం గ్రామానికి చెందిన మత్తి రాజాబాబు అనే వ్య క్తి తమ ఇంట్లో ఫంక్షన్ ఉందంటూ కొద్ది రోజులు ఇంటి పని చేయాలంటూ అదే గ్రామానికి చెందిన దుర్గ అనే ఎస్టీ యానాది కులానికి చెందిన 18 ఏళ్ల యువతిని పనికి పిలిచి ఇంట్లో దొంగతనం జరిగిందంటూ తప్పుడు నేరం వేస్తూ మైనర్ బాలిక పై పైశాచిక దాడి చేశాడు. ఈ ఘటనలో ఆ బాలిక తలకు రక్త గాయం ఒళ్లంతా తీవ్ర గాయాలు కావడంతో కేసు అవ్వకుండా తప్పించుకోవాలని ప్లాన్ చేసి బలవంతంగా నేరాన్ని ఒప్పించి ఆ నేరాన్ని దుర్గ పిన్ని అయిన పద్మ , దుర్గ అమ్మమ్మ అయిన రమణ మీద కూడా కేసు పెట్టి.. మరోమారు పోలీసులతో కొట్టించిన వైనం మోపిదేవిలో చోటుచేసుకుంది.
యజమాని కొట్టిన దెబ్బలతో ఉన్న వారిని కనీసం కనికరం చూపించకుండా మరో మారు మోపిదేవి ఎఎస్ గాయపరిచింది అంటూ బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తలకు గాయమై రక్తం కారుతున్న వైద్యం చేయించని పోలీసులు.. ఆస్ప త్రికి వెళితే వారి ఇల్లు తగలబెడతామంటూ మరింతగా భయపెట్టిన యజమాని మత్తి రాజబాబు.. దిక్కుతోచక గత్యంతరం లేక గాయాలు నొప్పులు భరించలేక ప్రభుత్వ వైద్యశాలకు వచ్చి వైద్యం మాత్రమే చేయండి కేసు పెడితే మా దొర చంపేస్తాడు అంటూ ఆస్పత్రి బయట రోడ్డుపై పడుకోవాలని బాధితులు నిర్ణయించుకున్నారు. స్థానికుల సమాచారంతో విషయం తెలుసుకున్న మాల మహానాడు కృష్ణాజిల్లా అధ్యక్షులు దోవా గోవర్ధన్ బాధితులను పరామర్శించి జరిగిన అన్యా యాన్ని తెలుసుకుని వారికి వైద్య సాయం ఇప్పించడంతో పాటు నేరం చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.