భార్యాభర్తల గొడవలకు … కన్న బిడ్డ బలి…!

Cruel Mother Throws Her Baby On Road

మానవ సంబంధాలు పలుచనయ్యాయి, క్షణిక సుఖాల కోసం అలవాటు పడి ఏమి చేస్తున్నారో ? కూడా తెలియకుండా తమ తమ కడుపునా పుట్టినవారిని కూడా చంపుకునేందుకు వెనుకాడడం లేదు. ఒక కుక్క కూడా తన పిల్లల్ని ఎవరైనా తీసుకెళ్ళడానికి, లేదా ఏమైనా చేయడానికి ప్రయత్నిస్తే తరిమి తరిమి కొడుతుందే, కానీ నేటి తరం ఆడవాళ్ళూ తమ భర్త, ప్రియుళ్ళని నమ్మించడానికో, సంతృప్తి పరచడానికో నవమాసాలు మోసి కనీ పెంచిన పిల్లల్ని చంపుకోడానికి కూడా సిద్దమవుతున్నారు. తాజాగా విజయనగరంలో తన వివాహేతర బంధానికి అడ్దోస్తున్నాడని ఇంటర్ చదివే కుర్రాడిని చంపిన ఘటన మరువక ముందే అలాంటి ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది.

cural-mom

వివరాల్లోకి వెళితే భర్తతో గొడపడి తన నెలలు నిండని పసిగుడ్డుని నడిరోడ్డు‌పై విసిరి కొట్టింది ఓ కర్కశపు తల్లి. ఈ ఘటన సోమవారం అర్ధరాత్రి మెహదీపట్నంలో చోటుచేసుకుంది. మెహిదీపట్నం ఫ్లైఓవర్‌ సమీపంలోని బస్టాండ్ వద్ద జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. అక్రమ సంబంధం పేరిట భర్త తనను అనుమానించాడని ఆ బిడ్డ తనకు పుట్టలేదని భర్త అనుమానిస్తున్నాడని అతడితో గొడవపడిన ఆ మాహా తల్లి నడిరోడ్డుపైనే కోపంతో చేతిలోని చిన్నారిని రోడ్డుపై పడేసింది. తనమీదున్న కోపాన్ని బిడ్డపై చూపడమేంటని భర్త ఆమె చెంపచెళ్లుమనిపించాడు. ఇదంతా అక్కడే విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్‌ పోలీసుల కంటబడింది. భార్యాభర్తలకు పోలీసులు కౌన్సిలింగ్‌ నిర్వహించి చిన్నారిని వారికి అప్పగించి అక్కడ నుంచి పంపించారు. ఈ ఘటన రాత్రి 10 గంటల ప్రాంతంలో జరిగింది. గొడవ కారణంగా ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. ఈ తతంగాన్ని చూసిన ఓ వ్యక్తి తన మొబైల్‌లో చిత్రీకరించి సామాజిక మాధ్యమాల్లో ఉంచడంతో వెలుగులోకి వచ్చింది.