Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
స్టార్ ఇండియా 6 నెలల ఆదాయంలో రూ.325 కోట్ల గండి. పెద్ద నోట్ల రద్దు ప్రభావం స్టార్ ఇండియా ప్రకటనల ఆదాయం మీద గణనీయంగా పడినట్టు ఆ సంస్థ స్వయంగా వెల్లడించింది. రెండు త్రైమాసికాలలో దాదాపు రూ. 325 కోట్ల మేరకు ఆదాయం తగ్గినట్టు ప్రకటించింది. జనవరి మార్చి మధ్య ఈ నష్టం ఎక్కువగా ఉండగా ఏప్రిల్-జూన్ మధ్య కొంతమేరకు తగ్గినట్టు ట్వెంటీ ఫస్ట్ సెంచరీ సీ ఎఫ్ వో జాన్ నలెన్ చెప్పారు.
నోట్ల రద్దు ప్రకటించిన వెంటనే మార్కెట్లో డిమాండ్ పడిపోతుందని అంచనావేసిన అడ్వర్టయిజర్లు చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తూ ఖర్చు తగ్గించుకున్న కారణంగా స్టార్ గ్రూప్ కు ప్రకటనల ఆదాయం తగ్గినట్టు చెప్పారు. అయితే, క్రమంగా ఆ ప్రభావం తగ్గుతూ వస్తున్నదని అందువలన కోలుకోవటానికి మరికొన్ని నెలలు పట్టవచ్చునని సూచనప్రాయంగా వెల్లడించారు. అయితే స్టార్ పోటీదారులైన జీ ఎంటర్టైన్మెంట్, వయాకామ్ లో సగం భాగస్వామి అయిన టీవీ18 సైతం నోట్ల రద్దు ప్రభావానికి నష్టపోయినవే.
టీవీ18 వాటా నష్టం కూడా దాదాపు 74% మేరకు నమోదైంది. జీ ఎంటర్టైన్మెంట్ అంతకు ముందు ఆర్థిక సంవత్సరంలో 20.1% ఆదాయంలో వృద్ధి నమోదు చేసుకోగా 2016-17 లో ఆ వృద్ధి రేటు 9.2% కు పడిపోయింది. ఎప్పుడూ అభివృద్ధిపథంలో దూసుకుపోయే సంస్థ సైతం అంత ఘోరంగా ఎదురుదెబ్బ తిన్నది. ట్వంటీ ఫస్ట్ సెంచరీ ఫాక్స్ ఆదాయం సైతం నిరుడు మూడో త్రైమాసికంలో 18% పడిపోవటానికి పెద్ద నోట్ల రద్దు ప్రభావంతో ప్రకటనలు తగ్గిపోవటమే.
అయితే, స్టార్ ఇండియా మాత్రం హాట్ స్టార్ కారణంగా తన పోటీదారులకంటే ఎక్కువగా ఆదాయం సంపాదించుకోగలుగుతోందని అందువలన నష్టాలను కొంతమేర సర్దుకోగలుగుతున్నామని ఆ సంస్థ చెబుతోంది. హాట్ స్టార్ చూస్తున్న సమయం నిరుటి కంటే 220% పెరగటాన్ని కూడా స్టార్ గుర్తు చేస్తోంది. అది నెట్ ఫ్లిక్స్ కంటే దాదాపు 14 రెట్లు ఎక్కువ సమయంగా అంచనా వేసింది.
మరిన్ని వార్తలు: