తాళ్లరేవు – కాట్రేనికోన మధ్య పెథాయ్.. హుటాహుటిన కదిలిన ఎన్డీఆర్ఎఫ్…!

Cyclone Phethai To Hit Andhra Pradesh

పెథాయ్ గమనాన్ని పరిశీలిస్తూ, అది ఎక్కడ తీరం దాటనుందో వాతావరణ శాఖ అధికారులు ప్రకటించారు. తాళ్లరేవు – కాట్రేనికోన మధ్య తీరం దాటుతుందని అధికారులు ప్రకటించడంతో, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు అక్కడికి చేరుకునేందుకు హుటాహుటిన కదిలాయి. ఇప్పటికే తీరం వెంబడి కుంభవృష్టి కరుస్తోంది. ప్రజలు సాయంత్రం 4 గంటల వరకూ ఇళ్లు దాటి బయటకు రావద్దని అధికారులు హెచ్చరించారు. తీరం దాటే సమయంలో నీరు కుమ్మరించినట్టుగా వర్షం కురుస్తుందని, ఈ ప్రభావం సుమారు గంట పాటు ఉంటుందని అంచనా వేస్తున్న అధికారులు, ఆ వెంటనే సహాయక చర్యలను ముమ్మరం చేయాలని ఆదేశించారు. తీరం దాటిన తరువాత దాని తీవ్రతను బట్టి తదుపరి ఆదేశాలు వెలువరిస్తామని అన్నారు. కాసేపట్లో తీరాన్ని పెథాయ్ తుఫాన్ తాకనుంది. కాకినాడకు 60 కి.మీ. దూరంలో కేంద్రీకృతం అయి ఉండగా అది ఎస్.యానాం, తాళ్ల రేవు మండలం గాడిమొగ, భైరవపాలెం మీదుగా తీరం దాటనునుంది. తీరం దాటే సమయంలో భారీగా ఈదురు గాలులు వీచే అవకాశం రాజోలు, సఖినేటి పల్లి, అమలాపురం, మలికిపురం, అంబాజీపేట, అల్లవరం, మామిడికుదురు, ఖాట్రేనికోన, ఉప్పలగుప్తం మండలాల్లో భారీ వర్షాలు భారీగా ఆస్తి నష్టం ఉంటుందని అంచనా వేస్తున్నారు.