దాచేపల్లి దుర్మార్గుడు సుబ్బయ్య ఆత్మహత్య

Dachepalli Minor Girl Rape Case Accuse Subbaiah Commits Suicide

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

గుంటూరు జిల్లా దాచేపల్లిలో 9 ఏళ్ల బాలికపై 50 ఏళ్ల సుబ్బయ్య అనే వ్యక్తి అఘాయిత్యానికి పాల్పడడంతో దాచేపల్లి  అట్టుడుకుతోన్న విషయం తెల్సిందే. కామంతో కళ్ళుమూసుకుపోయిన దుర్మార్గుడు అన్నం సుబ్బయ్య(50) అభంశుభం తెలియని మనవరాలు వయసున్న 9 ఏళ్ల బాలికపై అత్యాచారం చేయడంతో బాలిక తరుపు బంధువులు, గ్రామస్తుల ఆందోళనలతో అట్టుడికిన దాచేపల్లిలో ప్రస్తుతం పరిస్థితి నివురుగప్పిన నిప్పులా మారింది. నిన్నటి నుంచి 144 సెక్షన్ కొనసాగుతోంది. దాచేపల్లి, నడికుడి గ్రామాల్లో పోలీసులు మోహరించారు. అవాంఛనీయ ఘటనలు జరుగకుండా భారీ బందోబస్తు కొనసాగుతోంది. ప్రజలు గుంపులు గుంపులుగా తిరగొద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు. 
మరోవైపు దాచేపల్లిలో చిన్నారిపై అత్యాచారానికి పాల్పడిన నిందితుడు రామ సుబ్బయ్య కోసం పోలీసులు ముమ్మర గాలింపు చేసట్టారు. 17 పోలీసు బృందాలు నిందితుడి కోసం వేట కొనసాగిస్తున్నాయి.ఇంటెలిజెన్స్, కౌంటర్‌ ఇంటెలిజెన్స్, స్పెషల్‌ బ్రాంచ్‌ పోలీసులతో పాటు ఏఆర్, టాస్క్‌ఫోర్స్‌ను సైతం రంగంలోకి దించారు. అయితే నిందితుడు రామసుబ్బయ్యకు బంధువులు ఫోన్ చేస్తే తాను చనిపోతున్నానంటూ చెప్పాడు. ఆ తర్వాతి నుంచి అతని ఫోన్‌ కూడా స్విచ్‌ ఆఫ్ అని  వస్తోంది. పోలీసులు అతని సెల్‌ఫోన్‌ సిగ్నల్స్‌ను ట్రాక్‌ చేయగా… దాచేపల్లి సమీపంలోని తంగెడ గ్రామంలోని సెల్‌టవర్‌ పరిధిని చూపించింది. దీని సమీపంలోనే కృష్ణా నది ఉండటంతో…నదిలో దూకి ఉంటాడా లేదంటే..సెల్‌ఫోన్‌ పడేసి ఎటైనా వెళ్లిపోయాడా అనే అనుమానాలు తొలుత వ్యక్తమవుమయ్యాయి. దీంతో పోలీసులు కృష్ణానదిలో పడవలు, డ్రోన్ కెమేరాల ద్వారా గాలింపు చేపట్టారు. 
అయితే పోలీసులు ఇలా వెతుకుతుండగానే నిందితుడు ఆత్మహత్య చేసుకున్నాడు. గుంటూరు జిల్లా మాచర్ల దగ్గర్లోని దైద గ్రామ శివారులో చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. అమరలింగేశ్వరస్వామి ఆలయం దగ్గర మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. దీంతో పోలీసు యంత్రాంగం అక్కడికి తరలి వెళ్లింది. మరికాసేపట్లో దీనిపై స్పష్టత వచ్చే అవకాశముంది. ఒక వైపు కృష్ణా నదిలో ఒక మృతదేహం లభ్యం అవగా అది సుబ్బయ్యదే అనే వార్తలు వచ్చాయి.  అయితే పోలీసులు ఇంత వరకూ ఈ రెండింటిలో దేనినీ దృవీకరించలేదు. సుబ్బయ్య తన బంధువులకు ఫోన్ చేసి.. తాను చనిపోతున్నట్టుగా చెప్పిన కొన్ని గంటల్లోనే ఆత్మహత్య చేసుకున్నాడని వార్త బయటకి రావడం ఇప్పుడు మరిన్ని అనుమానాలకి తావిస్తోంది.