Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
సురేష్‌బాబు తనయుడు అభిరామ్‌పై శ్రీరెడ్డి సంచలన ఆరోపణలు చేసిన విషయం తెల్సిందే. అభిరామ్ తనను ప్రేమించి, పెళ్లి చేసుకుంటాను అంటూ వాడుకుని మోసం చేశాడని, అందుకు సంబంధించిన ఫొటోలు సైతం శ్రీరెడ్డి విడుదల చేసింది. శ్రీరెడ్డి ఫొటోలు విడుదల చేయడంతో ప్రస్తుతం టాలీవుడ్ అంతా కూడా ఇదే చర్చ జరుగుతూ ఉంది. ఈ విషయమై సురేష్‌బాబు ఫ్యామిలీ నుండి స్పందన కోరేందుకు అన్ని మీడియా సంస్థలు కూడా ప్రయత్నాలు చేస్తున్నాయి. అయితే సురేష్‌బాబు ఫ్యామిలీ మాత్రం ముందుకు రావడం లేదు. ఇక అభిరామ్ సహజంగా అయితే ప్రతి రోజు ఏదో ఒక పబ్‌లో లేదా పార్టీలో కనిపిస్తూనే ఉండేవాడు. కాని మూడు రోజులుగా అభిరామ్ ఎక్కడ కూడా కనిపించడం లేదు.
అభిరామ్ కుటుంబ సభ్యులకు సైతం చెప్పకుండా హైదరాబాద్ వదిలేసి వెళ్లినట్లుగా తెలుస్తోంది. గత రెండు రోజులుగా అభిరామ్ ఫోన్ ఆఫ్‌లో ఉందని, ఆయన స్నేహితులతో కూడా టచ్‌లో లేడని, దాంతో సురేష్‌బాబు ఫ్యామిలీ ఆందోళనలో ఉన్నట్లుగా తెలుస్తోంది. అభిరామ్ విదేశాలకు వెళ్లి ఉంటాడని కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తుండగా, లేదు ముంబయి లేదా బెంగళూరులో ఉన్నాడు అంటూ మరి కొందరు అంటున్నారు. అయితే మీడియా వర్గాల్లో మాత్రం ఈ వివాదం ముగిసే వరకు అభిరామ్‌ను కనిపించకుండా వెళ్లమని స్వయంగా దగ్గుబాటి వారి ఫ్యామిలీ సూచించి ఉంటుందని టాక్ వినిపిస్తుంది. మొత్తానికి అభిరామ్ మిస్సింగ్ ప్రస్తుతం టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయ్యింది.