Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
Danraj Doing Full Length Roll In Bhagmati
కమెడియన్‌గా కెరీర్‌ను ఆరంభించిన ధన్‌రాజ్ ఆరంభంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. అయితే ధన్‌రాజ్‌కు జబర్దస్త్ కార్యక్రమం బ్రేక్ ఇచ్చింది. ఈటీవీలో ప్రసారం అయిన జబర్దస్త్ కామెడీ షోతో ధన్ రాజ్ క్రేజ్ అమాంతం పెరిగి పోయింది. ఆ షో వల్ల హీరోగా కూడా చేసే అవకాశాలు దక్కాయి. ప్రస్తుతం పలు చిత్రాలను చేస్తున్న ధన్‌రాజ్ భవిష్యత్తులో దర్శకత్వం చేస్తాను అంటూ చెబుతున్నాడు. రోజుకు నాలుగు అయిదు ఆఫర్లు తన ముందుకు వస్తున్నాయని, అయితే సినిమాలో ప్రాధాన్యత లేని పాత్రలు వస్తుండటం వల్లే ఓకే చెప్పడం లేదని పేర్కొన్నాడు. ప్రస్తుతం అనుష్కతో’ భాగమతి’ చిత్రంలో నటిస్తున్నట్లుగా చెప్పుకొచ్చాడు.
‘పిల్లజమీందార్’ చిత్రంలో మంచి పాత్రను ఇచ్చి నన్ను ఎంకరేజ్ చేసిన అశోక్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘భాగమతి’ చిత్రంలో మరో మంచి పాత్ర దక్కింది. ఈ చిత్రంలో అనుష్కతో ఫుల్ లెంగ్త్ పాత్రను చేస్తున్నాను. అనుష్క పక్కనే ఉంటూ, ఆమె కనిపించిన ప్రతి సీన్లో కూడా నేను కనిపిస్తాను అంటూ ధన్ రాజ్ చెప్పుకొచ్చాడు. ‘భాగమతి’ చిత్రాన్ని మొదట ఛారిత్రాత్మక నేపథ్యం ఉన్న సినిమా అనుకున్నారు. కాని ఒక పక్కా కమర్షియల్ రెగ్యులర్ చిత్రంగా చిత్ర యూనిట్ సభ్యులు తాజాగా చెప్పుకొచ్చారు. అలాంటి చిత్రంలో ధన్‌రాజ్‌కు అవకాశం రావడం గొప్పవిషయమే. ముందు ముందు కూడా మంచి పాత్రలను మాత్రమే చేస్తానని తాజాగా ఒక మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు.
మరిన్ని వార్తలు