యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో హీరోయిన్స్ ప్రియదర్శి అలాగే నభా నటేష్ ల కలయికలో దర్శకుడు అశ్విన్ రామ్ తెరకెక్కించిన లేటెస్ట్ మూవీ నే “డార్లింగ్”. మరి టైటిల్ మరియు ఫస్ట్ లుక్ పోస్టర్ తో మంచి బజ్ ను సొంతం చేసుకున్న ఈ మూవీ గత జూలై 19న థియేటర్స్ లోకి మంచి ప్రమోషన్స్ ను చేసుకొని వచ్చింది. కానీ మూవీ అనుకున్న రేంజ్ లో రాణించలేదు. దీనితో థియేట్రికల్ గా రన్ ను ముగించుకున్న ఈ మూవీ ఇప్పుడు ఓటిటిలో రిలీజ్ అయ్యేందుకు సిద్ధం అయ్యింది.
మరి ఈ మూవీ తాలూకా స్ట్రీమింగ్ హక్కులు ప్రముఖ సంస్థ డిస్నీ+ హాట్ స్టార్ వారు సొంతం చేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే. ఇక ఇందులో ఈ మూవీ ఈ ఆగస్ట్ 13 నుంచి రిలీజ్ కు వచ్చేందుకు సిద్ధం అయ్యింది. ఈ అప్డేట్ ను హాట్ స్టార్ వారు తాజాగా అందించడంతో డార్లింగ్ ఓటిటి ఎంట్రీ ఖరారు అయ్యిపోయింది. ఇక ఈ మూవీ కి వివేక్ సాగర్ సంగీతం అందించగా “హను మాన్” నిర్మాణ సంస్థ ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మాణం వహించారు.