Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
పద్మావతి చిత్రంపై వివాదాలు కొనసాగుతున్నాయి. నిన్నటిదాకా రాజ్ పుత్ కర్ణి సేన సినిమా విడుదలను ఆపేందుకు పోరాటం చేస్తుండగా..ఇప్పుడు మేవార్ రాజవంశస్థులు వారికి జత కలిశారు. పద్మావతిలో రాజపుత్రుల చరిత్రను వక్రీకరించారని మేవార్ రాజవంశస్థుడు ఎంకే విశ్వరాజ్ సింగ్ ఆరోపించారు. హిందువుల చరిత్రతో పాటు భారతదేశ చరిత్రను కాపాడాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానికి ఉందని ఆయన అన్నారు. చరిత్రను వక్రీకరించి రూపొందించిన పద్మావతి సినిమా విడుదలను నిలిపివేయించాలని కోరారు. ఈ మేరకు ప్రధాని నరేంద్రమోడీకి, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిలిం సర్టిఫికేషన్ చైర్మన్ కు సమాచార, ప్రసార శాఖ మంత్రి స్మృతి ఇరానీకి, మానవ వనరులు, అభివృద్ధి శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ కు, రాజస్థాన్ ముఖ్యమంత్రి వసుంధరారాజే సింథియాకు ఆయన లేఖ రాశారు. రాణి పద్మిణిపై పరిశోధన చేసి ఈ సినిమాను రూపొందించానని సంజయ్ లీలా భన్సాలీ చెబుతున్నారని, ఇంతవరకు ఒక్కసారి కూడా ఆయన తమను సంప్రదించలేదని విశ్వరాజ్ సింగ్ ఆగ్రహం వ్యక్తంచేశారు. చరిత్రను వక్రీకరించే చిత్రాలతో జాతికి ప్రమాదమని ఆయన హెచ్చరించారు. పద్మావతి ప్రపంచ వ్యాప్తంగా డిసెంబరు 1న విడుదల కానుంది.