త్రుటిలో ప్రమాదం నుండి బయటపడ్డ ఏపీ మంత్రి

deputy cm escaped from a huge risk

ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పుష్ప శ్రీవాణి ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. ఆమె అధిరోహించిన సభా వేదిక కూలడంతో ప్రమాదం సంభవించింది. అయితే, ఆ ప్రమాదం నుంచి బయటపడ్డారు. ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తొలిసారి ఆమె జిల్లాకు వచ్చారు. ఈ సందర్భంగా విజయనగరం జిల్లా రాజపులోవాలో సభ ఏర్పాటైంది. సభా వేదిక మీదికి పెద్ద యెత్తున కార్యకర్తలు చేరుకోవడంతో తట్టుకోలేక వేదిక కూలింది. అప్రమత్తమైన భద్రతా సిబ్బంది వెంటనే మంత్రి పుష్పశ్రీవాణిని కిందకి దింపివేశారు. దీంతో ప్రమాదం తప్పినట్లయింది. డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారిగా జిల్లాకు వచ్చిన పుష్ప శ్రీవాణి రాజాపులోవ వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొన్నారు.