డేరా బాబా ఒక్కసారే రేప్ చేస్తాడట.

Dera-Baba-Will-Do-Sexual-Ha
Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

లేనివాడికి ఆకలి జబ్బు , ఉన్నవాడికి అరగని జబ్బు అంటుంటారు పెద్దలు. అయితే కామపిశాచి గుర్మీత్ కి మాత్రం సెక్స్ విషయంలో ఈ రెండు జబ్బులు వున్నాయట. ఈయన గారి లీలల్లో ఇంకో కొత్త విషయం వెలుగు జూసింది. బాబా తన ఆశ్రమం లోని మహిళా భక్తులతో పాటు హై ప్రొఫైల్ మోడల్స్, సినిమా హీరోయిన్స్ మీద బెదిరించి మరీ తన కామ దాహాన్ని తీర్చుకునేవాడట. ఆధ్యాత్మిక భావాలతో ఇలా డేరా కి వచ్చి బాబా చేతిలో బలైపోయిన ఎంతో మంది పరువు పోతుందన్న భయంతో జరిగిన ఘోరాన్ని బయటికి చెప్పకుండా అక్కడ నుంచి వెళ్లిపోయేవారట. ఆ బలహీనత పసిగట్టిన బాబా విశృంఖలంగా తన కోరికలు తీర్చుకునేవాడట. ఈయన కి కొత్త మహిళని చూస్తే కామపు ఆకలి జబ్బు పుట్టేడట. అంతకన్నా దారుణమైన విషయం ఏమిటంటే ఒక్కసారి ఓ మహిళతో ఆ అనుభవం అయ్యాక ఇక వారిని ఎన్నడూ తాకడానికి గుర్మీత్ ఇష్టపడేవారు కాదట. అంటే అయ్యగారు కోరిక కలిగినప్పుడు ఒక్కసారే రేప్ చేస్తారు అన్న మాట .

వందలు, వేల మంది సంచరించే డేరా లో ఇలాంటి అక్రమాలు జరుగుతుంటే ఇన్నాళ్లు ఎందుకు బయటకు రాలేదో తెలుసా ? భయం. తాను బాగా నమ్మిన కొందరిని డేరాలో అక్రమాలు జరిగే చోటుకి ఎవరూ రాకుండా బాబా కాపలాగా ఉంచేవారు. అలా కాపలాగా వున్న కొందరిలో లోపల ఏమి జరుగుతుందో చూచాయగా అర్ధం అవుతూనే ఉండేదట. అయినా భయంతో ఎవరూ నోరు మెదిపేవారు కాదు. అలా నోరు మెదిపిన ఒకరిద్దరు ప్రాణాలు పోగొట్టుకోవడంతో అక్కడ చాలా మంది భయంతో వణికిపోయేవారు. ఈ విషయాలు తెలియని ఎవరైనా బాబాని ఆ టైం లో కలవాలని చూస్తే వారికి ఆయన ధ్యానంలో వున్నారని అబద్ధాలు చెప్పి అక్కడ నుంచి పంపేవారు. తాజాగా ఈ విషయాలు అన్నీ బాబాకి దగ్గర బంధువు ఐనా భూపీందర్ సింగ్ గోరా మీడియా ద్వారా ప్రపంచానికి చాటి చెప్పాడు.