పట్టాలు తప్పిన గూడ్స్ రైలు.. రైళ్ల రాకపోకలకు అంతరాయం

derailed goods train

మహారాష్ట్రలోని జాంబ్‌రంగ్ – తకుర్‌వారి మధ్యలో ఓ గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. దీంతో పలు రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. ముంబై నుంచి పుణె వెళ్లాల్సిన ఇంటర్ సిటీ రైళ్లను రైల్వే అధికారులు నిలిపివేశారు. ముంబై నుంచి పుణె మీదుగా వెళ్లాల్సిన పలు రైళ్లను ఇగత్‌పురి మీదుగా మళ్లించారు. అయితే ముంబై – పుణె మీదుగా వెళ్లాల్సిన 10 రైళ్లను రద్దు చేశారు. నాలుగు రైళ్లను కల్యాణ్ – ఇగత్‌పురి – మన్మడ్ మీదుగా మళ్లించారు. గూడ్స్ రైలు పట్టాలు తప్పిన నేపథ్యంలో ముంబై – పుణె మార్గంలో బస్సుల సంఖ్యను రాష్ట్ర ప్రభుత్వ అధికారులు పెంచారు. గూడ్స్ రైలు పట్టాలు తప్పడంతో లోకల్ రైళ్లకు ఎలాంటి అంతరాయం ఏర్పడ లేదని రైల్వే అధికారులు స్పష్టం చేశారు. భారీ వర్షాల కారణంగా పట్టాలపైకి నీరు చేరడంతో కొంత ఆలస్యంగా రైళ్లు నడుస్తున్నాయని పేర్కొన్నారు. మొత్తానికి మహారాష్ట్ర పరిధిలోని రైలు ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.