Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
ఒక సినిమాకు సంగీతం అందించిన సంగీత దర్శకుడు ఆడియో వేడుక సందర్బంగా పాటలు పాడివ్వడం, తాను పాడటం చాలా కామన్ విషయం. కాని దేవిశ్రీ ప్రసాద్ కొత్త ఆనవాయితికి తెర లేపుతున్నాడు. తాను సంగీతం అందించిన ‘రంగస్థలం’ చిత్రం ఆడియో వేడుక సందర్బంగా స్టేజ్‌పై ఆడి పాడేందుకు ఏకంగా 25 లక్షల పారితోషికాన్ని ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాడట. ప్రత్యేకమైన ట్రూప్‌తో, డాన్సర్స్ మరియు సింగర్స్‌తో తాను స్టేజ్ షో ఇస్తాను అంటూ దేవిశ్రీ ప్రసాద్ నిర్మాతల ముందు ఈ ప్రపోజల్‌ను పెట్టినట్లుగా ప్రచారం జరుగుతుంది. ఆయన సంగీతం అందించిన సినిమా ఆడియో విడుదల వేడుకకు అంత స్థాయిలో పారితోషికాన్ని డిమాండ్ చేయడంతో నిర్మాతలు కంగుతిన్నారు.
ప్రస్తుతం టాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్లలో ఏ ఒక్కరు కూడా కోటికి పైగా పారితోషికాన్ని అందుకుంటున్న వారు లేరు. కాని దేవిశ్రీ ప్రసాద్ మాత్రం కోటిన్నర నుండి రెండు కోట్ల వరకు పారితోషికాన్ని అందుకుంటున్నాడు. పారితోషికం కాకుండా ఇలా సైడ్ బిజినెస్ ద్వారా కూడా దేవిశ్రీ కాసులను వసూళ్లు చేస్తూ విమర్శల పాలవుతున్నాడు. దేవిశ్రీ ప్రసాద్ తీరుపై టాలీవుడ్ వర్గాల్లో విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. అయితే దేవిశ్రీ ప్రసాద్ సన్నిహితులు మాత్రం ఈ విషయాన్ని కొట్టి పారేస్తున్నారు. చిత్ర యూనిట్ సభ్యులు మరియు దేవిశ్రీ ప్రసాద్ ఈ విషయమై అధికారికంగా క్లారిటీ ఇస్తే తప్ప విషయం ఏంటో క్లారిటీ వచ్చే అవకాశం లేదు. వచ్చే నెల మొదటి వారంలో ‘రంగస్థలం’ చిత్రం ఆడియో విడుదల కార్యక్రమం నిర్వహించనున్నారు. మార్చి చివర్లో సినిమాను విడుదల చేయబోతున్నారు.