Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
కరువు ప్రాంతం పులివెందులకు నీళ్లు వస్తుంటే ఆ నియోజకవర్గానికి ఎమ్మెల్యే గా వున్న జగన్ సంతోషించాలి. కానీ ఆయన సంతోషించకపోగా ఓ చెంబెడు నీళ్లు పోశారని ఎద్దేవా చేశారు. అటు పులివెందుల సభలో వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి కూడా చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయిర్ పనులు కూడా వై.ఎస్ వల్లే పూర్తి అయినట్టు చెప్పడంతో అయిన రచ్చ తెలిసిందే.
ఈ నేపథ్యంలో సీమకు ఇచ్చిన సాగునీరు విషయంలో ఏపీ జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమ కౌంటర్ ఇచ్చారు. అసలు సాగునీటి ప్రోజెక్టుల గురించి నిత్యం సీఎం కుర్చీ గురించే ఆలోచించే జగన్ కి ఏమి తెలుసని నిలదీశారు.
ఈ సందర్భంగా ఉమ మాటల్లో కొన్ని బులెట్ పాయింట్స్ మీ కోసం…
-
ఈ ఏడాది పులివెందులలో సుమారు 4 మీటర్లు మేర భూగర్భజలాలు పెరిగాయి
-
రాయలసీమ వాసుల ఈ ఏడాది సంతోషంగా ఉన్నారు
-
ఈ ఏడాది రాయలసీమ కి 123 టీఎంసీ లు నీళ్లు ఇచ్చాము
-
జగన్మోహన్ రెడ్డి బాధ్యతారాహిత్యంగా మాట్లాడుతున్నాడు
-
కాంగ్రెస్ హయాంలో మీరెందుకు పులివెందుల నీళ్లు తీసుకెళ్లలేకపోయారు
-
సీఎం పదవి పిచ్చితో ఎన్నికైయిన నియోజకవర్గo ని కూడా జగన్ పట్టించుకోలేదు
-
40 టీఎంసీ లు నీరు అందిస్తే చెంబుతో నీళ్లు పోశారు అని అపహాస్యంగా మాట్లాడుతున్నాడు
-
జగన్మోహన్ రెడ్డికి ఇరిగేషన్ ప్రోజెక్టుల మీద అవగాహన లేదు
-
పట్టిసీమ ఎక్కడ ఉందో కూడా తెలీదు
-
ప్రతీ శుక్రవారం కోర్ట్ కెల్లే జగన్ కి పులివెందుల నీరు వస్తే కనీసం అక్కడికి చూసేందుకు వెళ్లే తీరిక లేదు
-
త్వరలోనే రాయలసీమ లోని అన్ని ప్రోజెక్టులకు, రిజర్వాయిర్ కి దశల వారీగా నీరు ఇస్తాము
-
చంద్రబాబు అన్న మాట ప్రకారం పులివెందుల నీరు ఇచ్చారు
-
కుప్పం కంటే పులివెందులకే ముందు నీరు ఇచ్చాము
-
పులివెందులలో రాబోయే ఎన్నికల్లో కచ్చితంగా తెలుగుదేశం పార్టీ విజయం సాధిస్తుంది..