Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
మధ్యప్రదేశ్ సీఎంగా చక్రం తిప్పి, రాజకీయ దురంధరుడిగా పేరున్న డిగ్గీ రాజాకు బ్యాడ్ టైమ్ నడుస్తోంది. గోవాలో మెజార్టీ సీట్లు గెలిచీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటుచేయలేకపోవడానికి దిగ్విజయ్ కారణమని ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఆరోపించారు. దీంతో అధిష్టానం గోవా, కర్ణాటక ఇంఛార్జ్ నుంచి ఆయన్ను తప్పించింది. చివరకు తెలుగు రాష్ట్రాలే ఆయన చేతిలో ఉన్నాయి. ఇప్పుడు ఆ ముచ్చట కూడా తీరిపోయింది. తెలుగు రాష్ట్రాల ఇంఛార్జ్ గా కుంతియాను పోస్ట్ చేసింది హైకమాండ్.
ఈ మధ్య కాలంలో దిగ్విజయ్ ఏం మాట్లాడినా వివాదమే అవుతోంది. ఉద్దేశపూర్వకంగా విమర్శలకు తావిచ్చేలా మాట్లాడుతున్నారని సోనియాకు చాలా ఫిర్యాదులు వెళ్లాయి. హైదరాబాద్ వచ్చినప్పుడే కాదు.. ఢిల్లీలో కూడా డిగ్గీ లూజ్ టాక్ ఎక్కువైంది. అందుకే ఆయన్ను తప్పించిన సోనియా.. పార్టీ వ్యవహారాల్లో ఇకపై పెద్దగా ప్రాధాన్యత ఇవ్వకూడదని డిసైడయ్యారట.
సొంత రాష్ట్రంలో ఏ మాత్రం బలం లేని డిగ్గీరాజా.. కనీసం తెరవెనుక వ్యూహకర్తగా కూడా పనికిరావడం లేదనేది కాంగ్రెస్ భావన. అందుకే ఎందుకూ పని చేయనివాడికి పదవులెందుకని సోనియా అభిప్రాయపడినట్లు తెలుస్తోంది. ఇప్పటికైనా దిగ్విజయ్ సీరియస్ గా ఉండకపోతే.. ఈసారి రాజ్యసభ సభ్యత్వానికే ఎసరొస్తుందని హెచ్చరించిందట హైకమాండ్.
మరిన్ని వార్తలు: