ప్రముఖ తెలుగు నిర్మాత దిల్‌రాజు ఈ సంవత్సరం అంతగా సక్సెస్‌లు దక్కించుకోలేక పోయాడు. ‘లవర్’ మరియు ‘శ్రీనివాస కళ్యాణం’ చిత్రాలను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చిన దిల్‌రాజులు ఫ్లాప్‌లను చవిచూశాడు. ప్రస్తుతం రామ్‌తో నిర్మిస్తున్న ‘హలో గురు ప్రేమకోసమే’ చిత్రం విడుదలకు రెడీ అవుతుంది. దిల్‌రాజు తాజాగా మరో సినిమాను విడుదల చేసేందుకు సిద్దం అవుతున్నాడు. తమిళంలో భారీ అంచనాల నడుమ తెరకెక్కిన ‘96’ చిత్రం ఈనెల 13న విడుదల కాబోతుంది. విజయ్ సేతుపతి ప్రధాన పాత్రలో నటించగా, త్రిష హీరోయిన్గా నటించిన ఈ చిత్రంపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ చిత్రాన్ని తెలుగు రీమేక్ మరియు డబ్బింగ్ రైట్స్‌ను దిల్‌రాజు కొనుగోలు చేయడం జరిగింది.
తెలుగులో ఈ చిత్రం విడుదల తేదీపై క్లారిటీ లేదు. తమిళంలో విడుదలైన తర్వాత ఫలితాన్ని బట్టి తెలుగులో రీమేక్ చేయాలా లేదంటే డబ్బింగ్ చేసి వదలాలా అనే నిర్ణయానికి దిల్‌రాజు రాబోతున్నాడు. తెలుగులో రీమేక్ చేయడం కంటే డబ్బింగ్ చేసి విడుదల చేయడం వల్ల ఎక్కువ లాభం అని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అయితే సినిమా బాగుంటే, మంచి టాక్ వస్తే లాభాలను ఆశించకుండా రీమేక్ చేయాలి అనేది దిల్‌రాజు అభిప్రాయంగా తెలుస్తోంది. ఈనెల 13న సినిమా విడుదలైన తర్వాత దిల్‌రాజు ఈ విషయమై ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం ఉందని సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తుంది.