Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ తన కొడుకును హీరోగా పరిచయం చేస్తూ తెరకెక్కిస్తున్న చిత్రం ‘మెహబూబా’. తన సొంత బ్యానర్లో పూరి ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. ఇండియా పాకిస్తాన్ బోర్డర్లో ఈ చిత్రాన్ని ఎక్కువగా తెరకెక్కించారు. యుద్దం నేపథ్యంలో ఒక ప్రేమ కథతో ఈ చిత్రాన్ని పూరి తెరకెక్కిస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్ మరియు టీజర్లు అంచనాలు అమాంతం పెంచేశాయి. తన కొడుకుకు ఖచ్చితంగా కమర్షియల్ సక్సెస్ను ఇవ్వాలనే పట్టుదలతో దర్శకుడు ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. అందుకే ఈ చిత్రాన్ని కొనుగోలు చేసేందుకు ప్రముఖ డిస్ట్రిబ్యూటర్లు ముందుకు వస్తున్నారు. ఒక సినిమా కొనేందుకు ఎన్నో లెక్కలు వేసి, అంచనాలు వేసే దిల్ రాజు ఈ చిత్రాన్ని కొనుగోలు చేసేందుకు ముందుకు వచ్చాడు.
‘మెహబూబా’ చిత్ర యూనిట్ సభ్యులు అధికారికంగా దిల్రాజు తమ చిత్రంలో భాగస్వామి అయ్యాడు అంటూ ఒక ప్రకటన విడుదల చేయడం జరిగింది. పూరి జగన్నాధ్ దర్శకత్వంలో వచ్చిన పలు చిత్రాలను దిల్రాజు డిస్ట్రిబ్యూట్ చేశాడు. వాటిలో ‘ఇడియట్’ మరియు ‘పోకిరి’ చిత్రాలు భారీ బ్లాక్ బస్టర్ సక్సెస్లను దక్కించుకున్న విషయం తెల్సిందే. తాజాగా మరోసారి పూరిపై నమ్మకంతో ‘మెహబూబా’ చిత్రాన్ని దిల్రాజు పంపిణీ చేసేందుకు ముందుకు వచ్చిన నేపథ్యంలో సినిమాపై అంచనాలు భారీగా పెరుగుతున్నాయి. దిల్రాజు ఏ చిత్రం తీసుకున్నా కూడా ఆ చిత్రంకు అంచనాలు భారీగా పెరుగుతాయి. అలాగే ఈ చిత్రంపై అంచనాలు కూడా ఒక్కసారిగా ఆకాశానికి అంటాయి. దిల్రాజు తమ చిత్రాన్ని తీసుకున్నాడు అంటూ చిత్ర యూనిట్ సభ్యులు గర్వంగా ప్రకటించారు. ఇక ఈ చిత్రాన్ని మే 11న వేసవి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.