Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
మలయాళ స్టార్ గా వెలిగిపోతున్న దిలీప్ ను భావన కేసు ముప్పుతిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగిస్తోంది. బెయిల్ కోసం హైకోర్టుకు వెళ్లి తెలివిగా ప్రవర్తించాననుకున్న దిలీప్ కు పోలీసులు దిమ్మ తిరిగే షాకిచ్చారు. ప్రధాన నిందితుడు సునీతో దిలీప్ భేటీల వివరాలు, దిలీప్ రెండో ఫోన్ కాల్ రికార్డ్స్ మొత్తం కోర్టుకు సమర్పించారు. ఈ దెబ్బతో హైకోర్టు దిలీప్ కు బెయిల్ కూడా నిరాకరించింది.
కాగా ఈ కేసులో మరో కీలక సాక్ష్యం ఇంకా పోలీసులకు దొరకలేదు. అది దొరికితే ఇక దిలీప్ కథ కంచికే అంటున్నారు నిపుణులు. దిలీప్ అసలు ఫోన్ దొరకలేదు. అది దొరకగానే పోలీసులు మరింత రెచ్చిపోతారని తెలుస్తోంది. అదే జరిగితే దిలీప్ కెరీరే కాదు ఆయన భార్య కావ్య మాధవన్ కెరీర్ కూడా అర్థంతరంగా ఫుల్ స్టాప్ పడుతోంది. ఓ నటిపై ప్రతీకారం కోసం తన కెరీర్ నే పణంగా పెట్టాడని మాలీవుడ్ లో చర్చ జరుగుతోంది.
భావనపై కక్షతో దిలీప్ సునీతో కుదుర్చుకున్న ఒప్పందం, తర్వాత ఇచ్చిన ఫస్ట్ అడ్వాన్స్ పదివేలు, ఆ తర్వాత గుర్తుతెలియని వ్యక్తి ఖాతా నుంచి లక్ష రూపాయల ట్రాన్స్ ఫర్, భావనపై లైంగిక దాడికి ముందు, తర్వాత దిలీప్ సునీని నాలుగుసార్లు కలవడం.. ఇవన్నీ కేసులో కీలక విషయాలు. వీటన్నింటినీ సాక్ష్యాలతో సహా పోలీసులు హైకోర్టులో ప్రూవ్ చేశారు. దీంతో హైకోర్టుకు ఎందుకెళ్లానా అని దిలీప్ తలబాదుకుంటున్నాడట.
మరిన్ని వార్తలు