Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
జయలలిత చనిపోయాక… తమిళనాడులో రాజకీయం ఎవరికీ అర్థం కావడం లేదు. కొంత పట్టు సాధించామని సంబరపడ్డ బీజేపీ కూడా… తాజా షాకులతో చెన్నైకి దూరమైపోయింది. అందుకే కేంద్ర క్యాబినెట్లో అన్నాడీఎంకే చేరిక కూడా చివరి నిమిషంలో ఆగిపోయింది.
శశికళను కష్టపడి జైలుకు పంపినా… దినకరన్ మాత్రం ఏకు మేకై కూర్చున్నాడు. అసాధ్యమనుకున్న పన్నీర్, పళని కలయికను సాధ్యం చేశాక కూడా మోడీకి అనుకూలంగా సమీకరణాలు మారడం లేదు. పన్నీర్, పళని దగ్గరకు రాకుండా రిసార్ట్ లో ఉన్న ఎమ్మెల్యేల సంగతి పక్కనపెడితే… కనీసం వారి వద్ద ఉన్న వారైనా… బలపరీక్షకు అనుకూలంగా ఓటేస్తారో… లేదా అనే అనుమానం ఉంది.
ఇలాంటి పరిస్థితుల్లో మిమ్మల్ని ఎలా నమ్మాలని పన్నీర్, పళనికి మోడీ నుంచి ప్రశ్నలు ఎదురవతున్నాయి. దీంతో కేంద్రం క్వశ్చన్ పేపర్ కు ఆన్సర్స్ రాయలేక సీఎం, డిప్యూటీ సీఎం కిందామీదా పడుతున్నారు. ఓవైపు దినకరన్ మాత్రం దూకుడు పెంచుతూ… తనకు స్లీపర్ సెల్స్ చాలా ఉన్నాయని హల్చల్ చేస్తున్నారు.
మరిన్ని వార్తలు: