ప్రముఖ బాలీవుడ్ నటుడు దిన్యర్ కాంట్రాక్టర్ కన్నుమూసారు. కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న దిన్యర్ జూన్ 5వ తేదీ ఉదయం నవీ ముంబైలో తుదిశ్వాస విడిచారు. ఆయన వయసు 79 సంవత్సరాలు. థియేటర్ ఆర్టిస్ట్‌గా 1966లో దిన్యర్ తన సినీ ప్రయాణాన్ని ప్రారంభించారు. చోరీ చోరీ చుప్కే చుప్కే, ఖిలాడీ, బాద్షా, 36 చైనా టౌన్ వంటి పలు సినిమాల్లో కామెడీరోల్స్ చేసి, ప్రేక్షకులను అలరించారు. పలు టీవీ సీరియల్స్‌లోనూ నటించిన దిన్యర్‌ను ఈ ఏడాది జనవరిలో భారత ప్రభుత్వం పద్మశ్రీతో సత్కరించింది. ఆయన మృతికి భారత ప్రధాని నరేంద్ర మోడీ సంతాపం తెలిపారు. ఈ మేరకు అయన ట్వీట్ చేశాడు, ‘పద్మశ్రీ దిన్యర్ కాంట్రాక్టర్ ఓ నటుడిగా ప్రత్యేకం, థియేటర్, టీవీ, సినిమా.. ఇలా ఆయన ఎక్కడుంటే అక్కడ ప్రేక్షకుల ముఖాలపై చిరునవ్వులు మెరిసేవి.. అలాంటి దిన్యర్ ఈ లోకాన్ని విడిచి వెళ్ళడం బాధాకరం, వారి కుటుంబ సభ్యులకు నా ప్రడాఢ సానుభూతి తెలియచేస్తున్నాను’.. అంటూ, దిన్యర్కు షేక్ హ్యాండ్ ఇస్తున్న ఫోటోను షేర్ చేసారు మోడీ.