ప్రభాస్, రానాలు మంచి స్నేహితులు అనే విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వీరిద్దరు కలిసి ‘బాహుబలి’ చిత్రంలో నటించారు. వీరిద్దరి కాంబోలో త్వరలో మరో సినిమా వచ్చే అవకాశం కనిపిస్తుంది. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం ఫ్యామిలీ చిత్రాల దర్శకుడు దశరథ్ దర్శకత్వంలో వీరిద్దరు కలిసి నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. గతంలో ప్రభాస్‌తో ‘మిస్టర్ పర్ఫెక్ట్’ వంటి సూపర్ హిట్ చిత్రాన్ని తెరకెక్కించిన దశరథ్ ఆ తర్వాత ఆశించిన స్థాయిలో సక్సెస్‌ను దక్కించుకోవడంలో విఫలం అయ్యాడు. దాంతో కొంత కాలంగా ఈయనకు సినిమా ఆఫర్లే కరువయ్యాయి. మళ్లీ ఇన్నాళ్లకు ప్రభాస్‌తోనే ఛాన్స్ దక్కింది.
ఇటీవల ప్రభాస్‌ను కలిసిన దశరథ్ ఒక కథ చెప్పడం, ఆ కథకు ప్రభాస్ ఓకే చెప్పడం జరిగి పోయిందట. త్వరలోనే సినిమాకు సంబంధించిన పూర్తి స్క్రిప్ట్‌ను కూడా దశరథ్ పూర్తి చేయనున్నాడు. గతంలో సూపర్ హిట్ చిత్రాలను చేసిన దశరథ్ కొంత కాలంగా ఆకట్టుకోలేక పోతున్నాడు. ట్రెండ్‌కు తగ్గ చిత్రాలను ఈయన తీయడంలో విఫలం అవుతున్నాడు. అందుకే ఈసారి కాస్త విభిన్నంగా, తన స్టైల్లోనే కొత్తగా ప్రభాస్, రానాలతో సినిమా చేయాలని భావిస్తున్నాడు. ఈ చిత్రంలో ఇద్దరు హీరోలుగా కనిపిస్తారా లేదంటే రానా విలన్‌గా కనిపించనున్నాడా అనే విషయమై క్లారిటీ రావాల్సి ఉంది. ప్రస్తుతం భారీ బడ్జెట్ చిత్రం ‘సాహో’లో నటిస్తున్న ప్రభాస్ ఆ తర్వాత రాధాకృష్ణ దర్శకత్వంలో ఒక చిత్రాన్ని చేయబోతున్నాడు. ఆ తర్వాత దశరథ్ దర్శకత్వంలో సినిమా ఉంటుందని సినీ వర్గాల ద్వారా సమాచారం అందుతుంది.