Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
Director Harish Shankar Challenged critics About DJ Fake Collections
అల్లు అర్జున్ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘డీజే’. రెండు వారాల క్రితం ప్రేక్షకుల ముందుకు వచ్చి యావరేజ్ టాక్‌ను తెచ్చుకుంది. అయితే కలెక్షన్స్ మాత్రం భారీగా వచ్చాయి. మొదటి వారంలోనే 100 కోట్ల గ్రాస్‌ను వసూళ్లు చేసింది. అన్ని ఏరియాల్లో కూడా బన్నీ గత చిత్రాల కలెక్షన్స్‌ను దాటి వసూళ్లు సాధించింది అంటూ చిత్ర యూనిట్ సభ్యులు లెక్కలు ప్రకటిస్తున్నారు. అయితే కొందరు సోషల్ మీడియాలో మాత్రం ‘డీజే’ కలెక్షన్స్ ఫేక్ అంటూ ప్రచారం చేస్తున్నారు. సహజంగా ఇలాంటి ఫేక్ కలెక్షన్స్ అంటూ వ్యాఖ్యలు, విమర్శలు రావడం సహజం. వాటిని చిత్ర యూనిట్ సభ్యులు చూసి చూడనట్లుగా వదిలేయాలి. కాని హరీష్ శంకర్ సీరియస్ అయ్యాడు.
ఫేక్ కలెక్షన్స్ అంటూ వస్తున్న విమర్శలపై దర్శకుడు హరీష్ శంకర్ తనదైన శైలిలో మండి పడ్డాడు. అలా ప్రచారం చేస్తున్న వారిపై ఆగ్రహంను వ్యక్తం చేశాడు. ‘డీజే’ చిత్రం కలెక్షన్స్ ఫేక్ అంటూ నిరూపిస్తే తాను సినిమాల నుండి తప్పుకుంటాను అంటూ సంచలన ప్రకటన చేశాడు. ఆ ప్రకటన కాస్త బాగా ఫేమస్ అయ్యింది. మీడియాలో తెగ ప్రచారం జరిగింది. ఫేక్ కలెక్షన్స్ అంటూ అంతకు ముందు సోషల్ మీడియాలోనే ప్రచారం జరిగింది. కాని హరీష్ శంకర్ ఛాలెంజ్ వల్ల అందరికి ఫేక్ కలెక్షన్స్ గురించి సమాచారం వెళ్లి పోయింది. ఇప్పుడు అంతా కూడా డీజే ఫేక్ కలెక్షన్స్ అంటూ చర్చించుకుంటున్నారు. హరీష్ శంకర్ వల్ల డ్యామేజీ మరింత పెరిగిందని అల్లు ఫ్యామిలీ అసహనంతో ఉన్నట్లుగా తెలుస్తోంది.
మరిన్ని వార్తలు: