విజయ్ హీరోగా మురగదాస్ దర్శకత్వం లో వచ్చిన చిత్రం సర్కార్ ఈ చిత్రం తెలుగు, తమిళంలో విడుదలై మంచి విజయను దక్కించుకోవడమే గాక బాక్స్ ఆఫీస్ రికార్డ్స్ ను తిరగరాస్తుంది. తమిళనాడు తో పాటి ఇతర ప్రాంతాల్లో ఈ చిత్రం ఏకంగా 250కోట్లు కొల్లగోటింది. ఇప్పుడు ఈ చిత్రం పై తమిళ రాజకీయా నాయకుల్లో వేడిగా ఉన్నారు. ఈ చిత్రంలో వరలక్ష్మి శరత్ కుమార్ పోషించినా పాత్ర స్వర్గీయ శ్రీ మాజీ ముఖ్యమంత్రి జయలలితను పోలి ఉన్నయంటూ ఆ పార్టీ కి చెందినా రాజకీయ నాయకులు దర్శకుడు మురగదాస్ పైన గుర్రు మణి ఉన్నారు.
ఈ చిత్రంలోని కొన్ని సన్నివేశాలు తొలగించాలి అని డిమాండ్ చెయ్యడంతో, వాళ్ల కోరిక మేరకు కొన్ని సన్నివేశాలను తొలగించారు కూడా, అంతటితో ఆగకుండా ,మురగదాస్ తమకు బహిరంగ క్షమాపణ చెప్పాలి అని, భవిష్యతులో ఇలాంటి సినిమాలు తియ్యను అని లేఖ రూపంలో హామీ ఇవ్వాలి అని ఆ పార్టీ కి చెందినా కొంత మంది కోరారు. దానికి సమాధానంగా మురగదాస్ నేను బహిరంగ క్షమాపణ చెప్పాను. హామీ కూడా ఇవ్వను అని చెప్పేశాడు. మురగదాస్ సమాధానంతో తమిళ సినిమా, రాజకీయనాయకులు ఈ విషయంపై వేడి గా ఉన్నారు. మరి తరువాత పరిణామాలు మరింత ముదిరే లా ఉన్నాయి. ఈ వివాదం ఎక్కడికి దారితీస్తుందో అంటూ ఫ్యాన్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.