కొంత మంది డైరక్టర్స్ తెలుగు నుండి తమిళం అక్కడి నుండి మలయాళం ఇలా తమ సినిమా కు ఎక్కడ సారైనా హిట్ట్ దొరుకుతుందో అక్కడకు వెల్లుతుంటారు. అలా తెలుగులో మిస్సమ్మ, సదా మీ సేవలో, నందనవనం 120, మిస్టర్ మేధావి వంటి చిత్రాలను తీసిన దర్శకుడు నీలకంఠకు కమర్షియల్ గా సారైనా హిట్ట్ మాత్రం దొరకలేదు కానీ జాతీయ అవార్డు పొందిన మూవీని మాత్రం రూపొందించాడు అదే షో. కమర్షియల్ గా హిట్ట్ దక్కకపోతే మనదగ్గర దర్శకులు రానించడం కష్టం. ఎందుకు అంటే నిర్మాతలు కూడా తాము పెట్టిన పెట్టుబడికి లాభం ఆర్జించాలని చూస్తారు. కావున ప్రొడ్యూసర్స్ కూడా కమర్షియల్ గా ఉన్న సినిమాలకే ఎక్కువ పెట్టుబడి పెడుతారు.
దర్శకుడు నీలకంఠ తెలుగు నుండి మలయాళం సినిమా ఇండస్ట్రీస్ కు వెళ్ళిపోయాడు. అక్కడ బాలీవుడ్ హింది మూవీ క్వీన్ ను మలయాళం లో జాము జాము అనే పేరుతో రీమేక్ చేశాడు. సినిమాలో అక్కడక్కడ మార్పులు చేస్తూ తన సినిమా పంతంలో రీమేక్ చేశాడు. జామ్ జామ్ అనే చిత్రంలో మంజిమా మోహన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రం పై అక్కడ భారీ అంచనాలు ఉన్నాయి, బాలీవుడ్ క్వీన్ తెలుగు, తమిళం లో కూడా రీమేక్ అవ్వుతుంది. తెలుగులో తమన్నా నటిస్తుంటే. తమిళంలో కాజల్ అగర్వాల్ నటిస్తుంది. మలయాళం క్వీన్ రీమేక్ డిసెంబర్ 21 న టిజర్ ను విడుదల చెయ్యనున్నారు. ఈ రీమేక్ చిత్రం విజయం పైన నీలకంఠ ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. క్వీన్ రీమేక్ విజయంతో మరల తెలుగులో గ్రాండ్ గా ఎంట్రీ ఇవ్వాలని నీలకంఠ భావిస్తున్నాడు