వర్మ పైత్యం ముదిరింది

Director Ram Gopal Varma Announces GST Sequel

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

ఎన్నో అద్బుతమైన చిత్రాలను తెరకెక్కించి ట్రెండ్‌ సెట్టర్‌గా పేరు తెచ్చుకున్న దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ గత కొంత కాలంగా తన స్థాయికి తగ్గ చిత్రాలు కాకుండా చెత్త సినిమాలు అన్ని చేస్తూ ఉన్నాడు. ఇటీవలే నాగార్జునతో ఒక చిత్రాన్ని మొదలు పెట్టడంతో వర్మ మళ్లీ మునుపటి ఫాంలోకి వచ్చాడని, ఇకపై మళ్లీ వర్మ నుండి మంచి సినిమాలు వస్తాయని అంతా ఆశించారు. కాని షాకింగ్‌గా వర్మ పోర్న్‌ సినిమా తీసి తన స్థాయిని దిగజార్చుకున్నాడు. ఆడవారిని ఉద్దరిస్తాను అని, సెక్స్‌లో దైవత్వం చూపుతాను అంటూ వర్మ ‘గాడ్‌ సెక్స్‌ అండ్‌ ట్రూత్‌’ అనే చిత్రాన్ని చేయడం జరిగింది. ఆ సినిమా ఇటీవలే ఆన్‌లైన్‌లో విడుదలైంది. ఆ చిత్రంకు పెద్దగా ప్రేక్షకుల నుండి ఆధరణ రాలేదు. పోర్న్‌స్టార్‌ మియా న్యూడ్‌ ఇంటర్వ్యూను చూస్తున్నట్లుగా అనిపించిందని విమర్శలు వ్యక్తం అయ్యాయి.

ఈ సమయంలోనే వర్మ మరోసారి పోర్న్‌ సినిమా తీస్తాను అంటూ ప్రకటించాడు. అది కూడా తాజాగా విడుదలైన ‘జీఎస్టీ’కి సీక్వెల్‌గా, మొదటి పార్ట్‌లో ప్రేక్షకులు ఏం మిస్‌ అయ్యిందని భావిస్తున్నారో, దాన్ని రెండవ పార్ట్‌లో చూపిస్తాను అంటూ వర్మ చెప్పుకొచ్చాడు. మొదటి పార్ట్‌కు వస్తున్న మంచి స్పందనతో రెండవ పార్ట్‌ పని మొదలు పెట్టబోతున్నట్లుగా వర్మ పేర్కొన్నాడు. త్వరలోనే రెండవ పార్ట్‌కు సంబంధించిన వివరాలను తెలియజేస్తాను అంటూ చెప్పుకొచ్చాడు. ‘జీఎస్టీ 2’ కూడా పూర్తి స్థాయి పోర్న్‌ సినిమాలా ఉంటుందని వర్మ ముందే చెప్పేశాడు.

వర్మ నుండి తెలుగు ప్రేక్షకులు శివ, క్షణం వంటి మంచి చిత్రాలను ఆశిస్తున్నారు. కాని వర్మ మాత్రం పైత్యం, పిచ్చి ముదరడంతో పోర్న్‌ సినిమాల దారిలో పడ్డాడు. వర్మ ఇలాగే పోర్న్‌ తీసుకుంటూ వెళ్తే నాగార్జున కూడా ఆయనతో చేయాల్సిన సినిమాను క్యాన్సిల్‌ చేసుకుంటాడేమో అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. వర్మ ఎందుకు ఇలా చేస్తున్నాడో అంటూ ఆయన అభిమానులు నెత్తి నోరు బాదుకుంటున్నారు. కాని వర్మ మాత్రం తాను అన్నింట్లో కూడా ప్రతిభావంతుడిని అని నిరూపించుకునేందుకు పోర్న్‌ సినిమాలను కూడా తీస్తున్నాడు.