తప్పు మీద తప్పు చేస్తూనే ఉన్న శ్రీనువైట్ల

Director Srinu Vaitla doing same mistakes

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

చిన్న చిత్రాల దర్శకుడిగా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యి, ఆ తర్వాత స్టార్‌ హీరోలతో సినిమాలు చేసే అవకాశాలు దక్కించుకున్నాడు. చిరంజీవి, నాగార్జున, మహేష్‌బాబు వంటి స్టార్స్‌తో ఈయన సినిమాలు చేశాడు. ‘దూకుడు’ సినిమా శ్రీనువైట్ల కెరీర్‌ను మొత్తం మార్చేసింది. టాప్‌ దర్శకుల జాబితాలో శ్రీనువైట్ల చేరాడు. ఆ సినిమా తర్వాత వరుసగా శ్రీనువైట్లకు అవకాశాలు వచ్చాయి, అలాగే వరుసగా అట్టర్‌ ఫ్లాప్‌లు కూడా వచ్చాయి. ‘దూకుడు’ సినిమా తర్వాత వెంటనే ఎన్టీఆర్‌తో ‘బాద్‌షా’ చిత్రాన్ని శ్రీనువైట్ల తెరకెక్కించడం జరిగింది. ఆ సినిమా అట్టర్‌ ఫ్లాప్‌ అయ్యింది, ఆ తర్వాత మహేష్‌బాబుతో ‘ఆగడు’, రామ్‌ చరణ్‌తో ‘బ్రూస్‌లీ’, వరుణ్‌ తేజ్‌తో ‘మిస్టర్‌’ చిత్రాలు తెరకెక్కించి ఫ్లాప్‌ అయ్యాడు.

‘మిస్టర్‌’ చిత్రం కోసం శ్రీనువైట్ల పెద్ద సాహసమే చేశాడు. తన ఆస్తులను అమ్మి మరీ నిర్మాణంలో భాగస్వామి అయ్యాడు. సినిమా షూటింగ్‌ సమయంలో తన పారితోషికంతో పాటు 5 కోట్ల పెట్టుబడి పెట్టిన శ్రీనువైట్ల, ఆ సినిమా అట్టర్‌ ఫ్లాప్‌ అవ్వడంతో కోటి రూపాయలు నిర్మాతలకు శ్రీనువైట్ల తిరిగి ఇవ్వాల్సి వచ్చింది. పెట్టిన పెట్టుబడిలో కనీసం 25శాతం కూడా కలెక్షన్స్‌ రాకపోవడంతో నిర్మాతలు కుదేలయ్యారు. వారికి నష్టాన్ని భరిస్తాను అంటూ హామీ ఇచ్చిన శ్రీనువైట్ల కోటి రూపాయలతో సెటిల్‌మెంట్‌ చేసుకున్నాడు. ఇక తాజాగా మరోసారి అలాంటి సాహసాన్నే చేసేందుకు శ్రీనువైట్ల సిద్దం అవుతున్నాడు.

రవితేజతో శ్రీనువైట్ల ఒక సినిమాను ప్లాన్‌ చేస్తున్నాడు. ఆ సినిమా నిర్మాణంలో భాగస్వామ్యం అవ్వడంతో పాటు, లాస్‌ వస్తే నిర్మాతలకు మరికొంత అమౌంట్‌ను భరిస్తాను అంటూ అగ్రిమెంట్‌ చేసుకున్నారు. ఈ ఒప్పందంతో శ్రీనువైట్లకు నిర్మాతలు లభించారు. రవితేజతో శ్రీనువైట్ల తెరకెక్కించబోతున్న సినిమా ఫ్లాప్‌ అయితే ఖచ్చితంగా మరోసారి శ్రీనువైట్లకు పద్దె దెబ్బ తప్పదు. ఉన్నది కూడా అమ్ముకోవాల్సిన పరిస్థితి వస్తుందని ఆయన సన్నిహితులు వారించే ప్రయత్నం చేస్తున్నారు. కాని శ్రీనువైట్ల మాత్రం తప్పుమీద తప్పు అన్నట్లుగా మరోసారి అలాంటి పనే చేస్తున్నాడు. శ్రీనువైట్ల సినిమాలు మానేస్తే మంచిది అనే అభిప్రాయం కొందరు వ్యక్తం చేస్తున్నారు. శ్రీనువైట్ల మాత్రం తన సత్తా చాటుతాను అంటున్నాడు.