Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
Divya Darshanam Seva Closed By TTD
తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి ఎంత పవర్ ఫుల్లో అందరికీ తెలుసు. ఆయనకు మొక్కిన మొక్కు తీర్చకపోతే చెడు జరుగుతుందని దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా నమ్మకం ఉంది. కానీ స్వామి అంటే భక్తుల్లో ఉన్న భయం టీటీడీకి అసలు కనిపించదు. పైగా శ్రీవారి సన్నిధిలోనే భక్తుల్ని అడ్డగోలుగా దోచుకుంటూ మహదానందం పొందడం వారికి హాబీగా మారింది.
భక్తులకు ఎంతో ఉపయోగకరంగా ఉన్న దివ్యదర్శనం ఎత్తేయాలని టీటీడీ ప్లాన్ చేస్తోంది. రెండు లడ్డూలు ఉచితంగా ఇవ్వాల్సి వస్తోందని, అది భారమై పోతుందని టీటీడీ వాదన. కానీ రోజుకు రెండు కోట్ల రూపాయల హుండీ ఆదాయం వస్తున్నా.. దివ్య దర్శనం టోకెన్ల రద్దుకే టీటీడీ మొగ్గుచూపడం భక్తులకు విస్మయం కలిగిస్తోంది. నిర్వహణ భారం పెంచుకుంటూ.. టీటీడీయే ఖర్చు పెంచేస్తుందనేది బహిరంగ రహస్యం.
ఇంత జరుగుతున్నా ప్రభుత్వం కూడా టీటీడీని అదుపు చేయడం లేదు. పైగా ఆగమ సంప్రదాయాల పేరు చెప్పి.. భక్తుల్ని ఇబ్బందిపెట్టడంలో టీటీడీ ఆరితేరింది. ఇప్పటికే క్యూలైన్లలో భక్తుల్ని సంతలో పశువుల కంటే హీనంగా చూస్తున్న టీటీడీ.. ఇప్పుడు దివ్యదర్శనం ఎత్తేశాక ఇంకేం చేస్తుందో అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. భక్తిని వ్యాపారంగా మార్చేసిన టీటీడీ బుద్ధిని ఆ వెంకన్న బాబే మార్చాలి.
మరిన్ని వార్తలు