టాలీవుడ్ యూత్ ఫుల్ హిట్స్ మూవీ ల్లో యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో సిద్ధూ జొన్నలగడ్డ హీరోగా నేహా శెట్టి హీరోయిన్ గా నటించిన సాలిడ్ ఎంటర్టైనర్ మూవీ “డీజే టిల్లు” కూడా ఒకటి. మరి ఈ మూవీ కి అవైటెడ్ సీక్వెల్ అయితే ఈ మార్చ్ 29న మేకర్స్ గ్రాండ్ గా రిలీజ్ చేయబోతున్నారు.
మరి మొదటి పార్ట్ పెద్ద హిట్ కావడంతో ఈసారి వస్తున్నా “టిల్లు స్క్వేర్” పై మంచి అంచనాలుతో పాటుగా కొన్ని విషయాల్లో ఆడియెన్స్ కు చిన్న అనుమానాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు వరకు వచ్చిన కొన్ని సీక్వెల్స్ లో కొన్ని మొదటి పార్ట్ కు సంబంధం లేకుండా కొనసాగించినవి కూడా ఉన్నాయి. మరి వీటిపై లేటెస్ట్ ఇంటర్వ్యూలో సిద్ధూ క్లారిటీ ఇచ్చాడు.
ఈ మూవీ ఫస్ట్ పార్ట్ కి కొన్ని పాత పరిస్థితుల్లోనే ఉంటుంది. కానీ కొత్త పరిస్థితులు కొత్త అమ్మాయి ఇంకా మరికొన్ని కొత్త పాత్రలు ఇందులో పరిచయం అవుతాయి అని అలాగే సర్ప్రైజ్ లు లాంటివి ఉండవని క్లారిటీ ఇచ్చాడు. దీనితో గత మూవీ తో కోరుకున్న వైబ్ అయితే ఎక్కడా మిస్ కాదు అని చెప్పాలి. ఇక ఈ మూవీ కి రామ్ మల్లిక్ దర్శకత్వం వహించగా రామ్ మిర్యాల సంగీతం అందించాడు అలాగే సితార ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మాణం వహించిన సంగతి తెలిసిందే.