Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
టైమ్ మ్యాగజైన్ పర్సన్ ఆఫ్ ది ఇయర్ గా ఎంపికవ్వడం చాలా ప్రతిష్టాత్మకమైన విషయం. అయితే వరుసగా రెండు సార్లు ఆ అవార్డుకు ఒకే వ్యక్తి ఎంపికవ్వడం అత్యంత అరుదుగా మాత్రమే జరుగుతుంది. గత ఏడాది పర్సన్ ఆఫ్ ది ఇయర్ గా నిలిచిన ట్రంప్ ఈ సారి కూడా టైమ్ మ్యాగజైన్ తననే ఎం భావించి… ఆ గౌరవం వద్దనడం హాట్ టాపిక్ అయింది. ఏటా డిసెంబరులో టైమ్ పర్సన్ ఆఫ్ ది ఇయర్ ని ప్రకటిస్తుంది. ఈ సారి ఆ అవార్డు ఎవరికి ఇవ్వనుందో తెలియదు కానీ… ట్రంప్ ను ఇంటర్వ్యూ, ఫొటో షూట్ కావాలని కోరింది. దీంతో ట్రంప్ ఈ సారి కూడా తననే ఎన్నుకుంటున్నారనుకున్నారు. ఈ మేరకు ట్విట్టర్ లో ఓ పోస్ట్ చేశారు.
గత ఏడాది లాగే ఈ సారి కూడా టైమ్ మ్యాగజైన్ తననే పర్సన్ ఆఫ్ ది ఇయర్ గా ఎన్నుకునే అవకాశం ఉందని, అందుకే తనను ఇంటర్వ్యూ, ఫొటో షూట్ అడిగారని, అయితే ఇందుకు తాను వద్దని చెప్పానని ట్రంప్ ట్వీట్ చేశారు. ఎనీవే… థాంక్యూ అని కూడా ట్రంప్ పేర్కొన్నారు. దీనిపై టైమ్ కూడా రియాక్టయింది. పర్స్ ఆఫ్ ది ఇయర్ ను తాము ఎలా ఎంపికచేస్తామన్న విషయంపై అధ్యక్షుడు పొరపాటు పడుతున్నారని ట్వీట్ చేసింది. ఎంపికను ప్రకటించేంతవరకు టైమ్స్ దాని గురించి మాట్లాడబోదని, డిసెంబరు 6న ఎవరన్నది వెల్లడిస్తామని పేర్కొంది.