బిగ్‌బాస్ తెలుగు రెండవ సీజన్ సగం పూర్తి అయినా కూడా ఇంట్లో ఇంకా 14 మంది ఉన్నారు. ప్రస్తుతం ఇంట్లో ఉన్న వారు 12 మంది కాగా, ఎలిమినేట్ అయ్యి మళ్లీ ప్రేక్షకుల ఓట్ల ద్వారా వచ్చిన వారు ఇద్దరు ఉన్నారు. మొత్తంగా 14 మంది ఉన్నారు. ఇంకా 50 రోజులు మిగిలి ఉన్నాయి. అంటే దాదాపుగా ఏడు వారాలు మాత్రమే మిగిలి ఉన్నాయి. వారంకు ఒక్కరు చొప్పున ఎలిమినేట్ అయితే ఇంకా ఏడుగురు ఇంట్లో ఉండే అవకాశం ఉంది. ఫైనల్‌కు నలుగురు లేదా ఐదుగురు మాత్రమే ఉండే అవకాశం ఉంది. అంటే ఇంకో ఇద్దరు లేదా ముగ్గురు ఎక్కువగా ఉంటున్నారు. అందుకే రెండు లేదా మూడు వారాల పాటు డబుల్ ఎలిమినేషన్ ఉండే అవకాశం ఉందని అనిపిస్తుంది.
ఈ వారంలో ఇద్దరు ఎంట్రీ ఇస్తున్నారు కనుక ఎలిమినేషన్స్‌లో ఉన్న ఆరుగురిలో ఇద్దరు ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉందని అంతా భావిస్తున్నారు. సోషల్ మీడియాలో కౌశల్‌కు భారీ ఎత్తున మద్దతు ఉంది. అందుకే ఆయన సేఫ్ జోన్లోకి వెళ్లి పోవడం ఖాయం. ఇక డేంజర్ జోన్లో ఉన్నది గణేష్, దీప్తి, బాబులు ఈ ముగ్గురిలో ఇద్దరు వెళ్లడం ఖాయంగా కనిపిస్తుంది. ఈ ముగ్గురితో పాటు నందిని కూడా కాస్త వీక్‌గానే అనిపిస్తుంది. అయితే ఆమె ఎలిమినేషన్‌కు తక్కువ ఛాన్స్ ఉందని సోషల్ మీడియాలో బిగ్‌బాస్‌ను విశ్లేషిస్తున్న వారు చెబుతున్నారు. మొత్తానికి ఈ వారం అంతా ఆసక్తిగా సాగబోతుందని మాత్రం అనిపిస్తుంది. బిగ్‌బాస్ సీజన్ 2లో రీ ఎంట్రీ ఇవ్వబోతున్న నూతన్ నాయుడు, శ్యామలలు ఇంకా ఇంట్లోకి వెళ్లలేదు. వారి ఎంట్రీ ఎలా ఉంటుందో అనేది అందరిలో ఆసక్తిని రేకెత్తిస్తోంది. మొత్తంగా ఈ వారం మొత్తం బిగ్‌బాస్ థ్రిల్ చేయడం ఖాయం అనిపిస్తుంది.