డ్రంక్ అండ్ డ్రైవ్ ని తీవ్ర నేరంగా పరిగణిస్తూ అలా తప్ప తాగి వాహనాలు నడుపుతున్న వారి మీద కేసులు పెట్టి వారి మీద లీగల్ గా ముందుకు వెళుతున్న సంగతి తెలిసిందే. అయితే ఇలా చేయడం పలు హింసాత్మక ఘటనలకి దారి తీస్తోంది. వారిని చెక్ చేసి కేసులు నమోదు చేస్తున్న సమయుంలో కొందరు పోలీసులకు సహకరించకపోగా వారిపై భౌతిక దాడులకు దిగుతున్నారు. కవర్ చేస్తున్న మీడియాపై దాడులు చేస్తున్నవి తరచూ వింటూనే ఉన్నాం. అయితే ఈ సమస్యను దృష్టిలో ఉంచుకొని తెలంగాణా ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది.
అదేంటంటే తనిఖీల్లో సాధారణ పోలీసులతో పాటు ఆర్మ్‌డ్ ఫోర్స్ కూడా ఉంచాలని తెలంగాణ ప్రభుత్వం నిర్వయం తీసుకుంది. వాహనాలు నడిపే మందుబాబులను పూర్తి స్థాయిలో కట్టడి చేయాలనే ఉద్దేశంతో ఆర్మ్‌డ్ పోర్స్ సహాయం తీసుకోవాలని నిర్ణయంచినట్లు సైబరాబాద్ సీపీ ప్రకటించారు. ఈ ఏడాది తొలిభాగంలో మొత్తం 7,791 డ్రంకెన్ డ్రైవ్ కేసులు నమోదు చేసి, దాదాపు రూ.85 లక్షల వరకు జరిమానా వసూలు చేసి, 1379 మందిని జైలుకు పంపించామని ఈ సందర్భంగా ఆయన ప్రకటించారు.