డిసెంబర్లో మళ్లీ దబిడి దిబిడి

drugs-case-charge-sheet-to-be-filed-in-court-by-december

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

డ్రగ్స్ కేసు ప్రస్తుతానికి చల్లారినట్లు కనిపిస్తున్నా మళ్లీ త్వరలోనే సంచనాలు ఉంటాయని తెలుస్తోంది. దేశవ్యాప్తంగా డ్రగ్స్ కు కేంద్రంగా ఉన్న పంజాబ్ లో జరగని స్ట్రిక్ట్ విచారణ హైదరాబాద్ లో జరగడంపై అన్ని రాష్ట్రాల నుంచి ప్రశంసలు వెల్లువెత్తాయి. అయితే సినీ ప్రముఖుల విచారణ తర్వాత దూకుడుకు బ్రేకేసింది సిట్. మరి తర్వాత స్టెప్ ఏంటన్నది ఆసక్తికరంగా మారింది.

ప్రస్తుతానికి సినీ ప్రముఖుల విచారణలో వెల్లడైన వాస్తవాలకు ఆధారాలు సేకరిస్తున్న ఎక్సైజ్ శాఖ.. డిసెంబర్ నాటికి కోర్టులో ఛార్జిషీట్లు దాఖలు చేస్తుందట. నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు, న్యాయనిపుణులతో చర్చించి నోట్స్ తయారు చేస్తున్నారు. సిట్ ఇప్పటివరకు 22 మంది అరెస్ట్ చేసిందని, సినీ ప్రముఖులు సాక్షులుగానే ఉంటారా.. నిందితులౌతారా అనేది ఇప్పుడే చెప్పలేమన్నారు.

విచారణ ముందుకు సాగేకొద్దీ కొత్త లింకులు దొరుకుతాయని, అప్పుడే సినీ ప్రముఖుల పాత్రపై క్లారిటీ వస్తుందంటున్నారు. ప్రస్తుతం స్కూల్స్ లో కూడా డ్రగ్స్ విషయంలో అవగాహన కలిగిస్తున్న ఎక్సైజ్ ఎన్ ఫోర్స్ మెంట్ చీఫ్ అకున్ సభర్వాల్.. ఈ కేసు విషయంలో పట్టుదలగానే ఉన్నారు. సీఎం కేసీఆర్ భరోసా కూడా ఉంది కాబట్టి.. డిసెంబర్లో మళ్లీ షాకులు తప్పకపోవచ్చు.

మరిన్ని వార్తలు: