Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
శ్రీదేవి మరణం వెనక ఎలాంటి కుట్రాలేదని దుబాయ్ పోలీసులు వెల్లడించారు. ఫోరెన్సిక్ నివేదికను అక్కడి అధికారులు పోలీసులకు అందించారు. అనంతరం మరణధృవీకరణ పత్రం జారీ చేశారు. ఫోరెన్సిక్ నివేదికను పూర్తిగా పరిశీలించిన పోలీసులు శ్రీదేవి గుండెపోటుతోనే చనిపోయిందని తెలిపారు. ఇమ్రిగ్రేషన్ ప్రక్రియ పూర్తయిన తర్వాత శ్రీదేవి భౌతికకాయాన్ని కుటుంబసభ్యులకు అప్పగిస్తారు. ప్రముఖ పారిశ్రామిక వేత్త అనిల్ అంబానీ ఏర్పాటుచేసిన 13 సీట్ల ప్రయివేట్ జెట్ విమానంలో శ్రీదేవి పార్థివదేహాన్ని ముంబైకి తీసుకురానున్నారు.
ఈ రోజు రాత్రి పదిగంటల తర్వాత శ్రీదేవి మృతదేహం ముంబైకి చేరుకోనున్నట్టు సమాచారం. ముంబైలోని భాగ్య బంగ్లాలో అభిమానుల సందర్శన నిమిత్తం శ్రీదేవి పార్థివదేహాన్ని ఉంచనున్నారు. రేపు జూహులోని శాంతాక్రుజ్ స్మశానవాటికలో అం త్యక్రియలు నిర్వహించనున్నారు. మరోవైపు ఆమెకు తుదినివాళులర్పించేందుకు ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు ముంబై చేరుకున్నారు. టాలీవుడ్ హీరో వెంకటేశ్ సహా పలువురు ప్రముఖులు అనిల్ కపూర్ నివాసానికి వెళ్లారు.