Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
Allu Arjun Duvvada Jaghannadhm Story Has Become Clear
అల్లు అర్జున్, హరీష్ శంకర్ల కాంబినేషన్లో తెరకెక్కిన ‘డీజే’ చిత్రం మరో మూడు రోజుల్లో ప్రేక్షకలు ముందుకు రాబోతుంది. భారీ అంచనాల నడుమ తెరకెక్కిన ఈ సినిమాను దిల్‌రాజు ప్రతిష్టాత్మకంగా నిర్మించాడు. ఈ చిత్రంలో బన్నీ రెండు విభిన్న పాత్రల్లో కనిపించబోతున్నట్లుగా ట్రైలర్ మరియు పోస్టర్లను చూస్తుంటే అనిపిస్తుంది. అయితే సినిమాలో బన్నీ డబుల్ ఫోజ్ కాదు అని సమాచారం. తాజాగా సినీ వర్గాల్లో మరియు మీడియా సర్కిల్లో ‘డీజే’ కథ అంటూ ఒక కథ తెగ సర్కులేట్ అవుతుంది. ఆ కథ రెగ్యులర్‌గానే ఉన్నా కూడా టేకింగ్‌తో దర్శకుడు ఆకట్టుకుంటాడనే నమ్మకంతో ఫ్యాన్స్ ఉన్నారు.
ఇంతకు ‘డీజే’ కథ ఏంటి అంటే.. వివాహాది వేడుకలకు వంటలు చేసే బ్రహ్మణ కుటుంబంకు చెందిన వ్యక్తి దువ్వాడ జగన్నాథం. ఒక అగ్రహారంలో డీజే కుటుంబంతో హాయిగా జీవితాన్ని సాగిస్తూ ఉంటాడు. ఒక రౌడీ గ్యాంగ్ అగ్రహారంను కాజేసేందుకు ప్రయత్నం చేస్తుంది. వారి ఆటకట్టించేందుకు బ్రహ్మణుడు కాస్త మాఫియా డాన్‌గా అవతారం ఎత్తుతాడు. ఎవరికి తెలియకుండా తన అగ్రహారంను రౌడీ గ్యాంగ్, రియల్ఎస్టేట్ మాఫియా నుండి ఎలా కాపాడాడు అనేది కథగా చెప్పుకుంటున్నారు. ఈ కథలో హీరోయిన్ సాయంతో హీరో రియల్ ఎస్టేట్ మాఫియా పని పడతాడని తెలుస్తోంది. స్క్రీన్‌ప్లే మరియు దర్శకత్వంతో దర్శకుడు సినిమాను అద్బుతంగా తెరకెక్కించాడని చిత్ర యూనిట్ సభ్యులు అంటున్నారు.
మరిన్ని వార్తలు
వరుసగా 3 సార్లు.
రిలేషన్ కొనసాగుతూనే ఉంది.. ఇదే సాక్ష్యం
