Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
సూపర్ స్టార్ మహేష్‌బాబు హీరోగా తెరకెక్కిన ‘భరత్ అనే నేను’ విడుదలకు సిద్దం అయ్యింది. ఈనెల 20న ప్రపంచ వ్యాప్తంగా అత్యంత భారీ ఎత్తున విడుదలకు సిద్దం అయ్యింది. తాజాగా ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. సెన్సార్ బోర్డు కట్స్ ఏమీ చెప్పకుండా యూ/ఎ సర్టిఫికెట్‌ను ఇవ్వడం జరిగింది. ఈ చిత్రంలో మహేష్‌బాబు సీఎంగా కనిపించబోతున్నాడు కనుక తెలుగు రాష్ట్రాల్లో ఉన్న రాజకీయ పరిస్థితులపై సెటైర్స్ ఉండే అవకాశం ఉందని, లేదంటే కేంద్రం వ్యవహరిస్తున్న తీరుకు వ్యతిరేకంగా అయినా ఉండే అవకాశం ఉందని ప్రచారం జరిగింది. అయితే అలాంటిది ఏమీ ఉండదని దర్శకుడు చెబుతూ వచ్చాడు. తాజాగా నిర్మాత దానయ్య కూడా ఆ విషయంపై క్లారిటీ ఇచ్చాడు.
గత కొంత కాలంగా భరత్ అనే నేను చిత్రంపై వస్తున్న రాజకీయ పుకార్లపై నిర్మాత దానయ్య ఒక ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చాడు. తమ సినిమాలో ఏ ఒక్క రాజకీయ పార్టీని విమర్శించడం కాని, ప్రస్తుత రాజకీయ విషయాల గురించి ప్రస్థావించడం కాని చేయలేదని, ఇది పూర్తిగా వివాద రహిత చిత్రంగా ఉంటుందని ఆయన చెప్పుకొచ్చాడు. దర్శకుడు కొరటాల ఎక్కడ పొరపాటు లేకుండా, అన్ని విషయాల్లో జాగ్రత్తలు తీసుకుని వివాద రహితంగా సినిమాను తెరకెక్కించాడు. రంగస్థలం వంటి సినిమాపైనే కొందరు విమర్శలు చేసి, వివాదాన్ని లేవనెత్తారు. అలాంటిది భరత్ చిత్రంపై చిన్న వివాదం కూడా లేవనెత్తే అవకాశం ఎవరికి ఇవ్వకుండా ఈ చిత్రాన్ని తీశారట.