ఇంజినీరింగ్ కళాశాలలు ఇంకా ఫీజు ఖరారుచేయని కారణంగా సోమవారం ప్రారంభం కావాల్సిన ఎంసెట్ వెబ్ కౌన్సెలింగ్ ప్రక్రియను ఈ నెల ఐదు నుంచి ప్రారంభిస్తున్నట్టు టీఎస్ ఎంసెట్ కన్వీనర్ నవీన్ మిట్టల్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇప్పటివరకు 37,413 మంది విద్యార్థులకు సర్టిఫికెట్ వెరిఫికేషన్ పూర్తయిందన్నారు. ఆదివారం 7500 మంది ధ్రువపత్రాల పరిశీలనకు హాజరయ్యారని చెప్పారు. సర్టిఫికెట్ వెరిఫికేషన్ కోసం 53,364 మంది విద్యార్థులు స్లాట్ బుక్ చేసుకున్నారని తెలిపారు. సోమవారం వరకు స్లాట్ బుకింగ్‌కు గడువు ఉన్నదని, ఈ నెల 3న వెరిఫికేషన్ పూర్తవుతుందని తెలిపారు. ఎంసెట్ ధ్రువపత్రాల పరిశీలన, స్లాట్ బుకింగ్ వివరాల కోసం https://tseamcet.nic.in వెబ్‌సైట్‌ను సంప్రదించాలని కోరారు.