Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
Effect Of The Republic TV Sting Operation To The Ashoka Gajapati Raju
అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి విశాఖ ఎయిర్ పోర్ట్ ఎపిసోడ్ మళ్లీ తెరపైకి వచ్చింది. ఇండిగో ఎయిర్ లైన్స్ స్టాఫ్ పై చేయి చేసుకుని.. తర్వాత విదేశాలకు చెక్కేసిన జేసీ.. మళ్లీ ఇండియాకు వచ్చి అశోక్ ను బుక్ చేశారు. ఆర్నాబ్ గోస్వామికి చెందిన రిపబ్లిక్ టీవీ స్టింగ్ ఆపరేషన్ లో జేసీ నిజాలు చెప్పేసి.. కేంద్రమంత్రిని ఇరకాటంలో నెట్టారనే మాట వినిపిస్తోంది.
తాను హడావిడిలో ఉన్నానని, రెండుమూడుసార్లు అడిగినా బోర్డింగ్ పాస్ ఇవ్వకపోవడం కోపం తెప్పించిందన్నారు జేసీ. చివరకు మంత్రి జోక్యం చేసుకున్నారని, ఆయనే తనకు బోర్డింగ్ పాస్ ఇప్పించారని, జేసీ చెప్పడం వివాదాస్పదమైంది. ఓవైపు అశోక గజపతిరాజుకు నిజాయితీపరుడిగా మంచి పేరుంది. కానీ జేసీ ఎపిసోడ్ లో మాత్రం అశోక్ ఇరుక్కున్నారనే భావన వ్యక్తమౌతోంది.
అయితే ఈ ఎపిసోడ్ లో అశోక్ కు ముప్పుండదనే ప్రచారం జరుగుతోంది. మోడీ ఏరికోరి అశోక్ కు మంత్రి పదవి అప్పగించారు. అశోక్ పనితీరుపై కూడా ఆయన చాలా సంతృప్తిగా ఉన్నారు. కానీ విపక్షాలు కూడా అశోక్ ను వేలెత్తి చూపించలేని వ్యక్తిత్వం ఆయన సొంతం. అలాంటి అశోక్ గజపతిరాజును ఇలాంటి స్టింగ్ ఆపరేషన్లు ఏమీ చేయలేవని ఆయన సన్నిహితులు చెబుతున్నారు.
మరిన్ని వార్తలు: