Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
ఎలక్ట్రానిక్ వోటింగ్ మెషిన్ భారత ప్రజాస్వామ్య వ్యవస్థలో మేలి మలుపుగా భావించారు. అయితే ఈవీఎం లు వచ్చాక ఓడిపోయిన పార్టీలు ఈ మెషిన్ పని తీరు మీద అనుమానం వ్యక్తం చేయడం ఆనవాయితీగా మారింది. ఆ సందేహాలు తీర్చడానికి ,ఈవీఎం లు టాంపరింగ్ కావని చెప్పడానికి ఈసీ ఎన్నో ప్రయత్నాలు చేసింది. మరెన్నో అవగాహన సదస్సులు నిర్వహించింది. అయినా పార్టీల ధోరణి మారలేదు. అందుకే దేశంలో తొలిసారిగా నంద్యాల ఉపఎన్నికలతో ఇటు పార్టీలు, అటు ఓటర్ల సందేహాలు తీర్చే పనికి పూనుకుంది. ఇన్నాళ్లు ఈవీఎం మీద వున్న ప్రధాన ఆరోపణ …ఏ గుర్తు మీద ఓటు వేసినా ఇంకో గుర్తు మీద ఓటు పడుతుందని. ఈ సందేహాన్ని తీర్చడానికి నంద్యాలలో తొలిసారి vvpat ఏర్పాటు చేస్తోంది. ఈవీఎం పక్కన వుండే ఈ మెషిన్ ద్వారా ఓటరు తాను ఎవరికి ఓటు వేస్తోంది ప్రత్యక్షంగా చూసుకోవచ్బు. ఈ మెషిన్ ఏర్పాటుతో పాటు ఆ అంశానికి ఎన్నికల సంఘం విస్తృత ప్రచారం కూడా కల్పిస్తోంది.
మరిన్ని వార్తలు: