వైకాపా ఎమ్మెల్యేకు సవాల్.. నల్లమిల్లి నివాసం వద్ద ఉద్రిక్తత తూర్పు గోదావరి జిల్లా అనపర్తి మండలం రామవరంలో భారీగా పోలీసులు మోహరించారు. తెదేపాకు చెందిన మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి నివాసం వద్దకు పెద్ద ఎత్తున చేరుకున్నారు. తూర్పుగోదావరి జిల్లా అనపర్తి మండలం రామవరంలో భారీగా పోలీసులు మోహరించారు. తెదేపాకు చెందిన మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి నివాసం వద్దకు పెద్ద ఎత్తున చేరుకున్నారు. వైకాపా ఎమ్మెల్యే సత్తి సూర్యనారాయణరెడ్డి అవినీతి, అక్రమాలపై ఆయన నివాసానికే వెళ్లి చర్చిస్తానని, 109 అంశాలపై చర్చకు సిద్ధమా? అని గురువారం నల్లమిల్లి సవాల్ విసిరారు. తాను కూడా 175 మంది ఎమ్మెల్యేల్లో ఒక్కడినే అవినీతి చేయలేదంటున్న సూర్యనారాయణరెడ్డి.. చర్చకు ఎందుకు రావడం లేదని నిలదీశారు.
ఈ సందర్భంలో శుక్రవారం ఉదయం రామవరం నుంచి అనపర్తిలోని ఎమ్మెల్యే ఇంటికి నల్లమిల్లి బయల్దేరారు. అయితే పోలీసులు రామకృష్ణారెడ్డిని రామవరంలోనే నిలువరించారు. వాహనం చుట్టూ చేరి ముందుకు కదలకుండా అడ్డుకున్నారు. మరోవైపు పెద్ద ఎత్తున తెదేపా కార్యకర్తలు, నేతలు అక్క డికి చేరుకున్నారు. బారికేడ్లను దాటి ఎమ్మెల్యే ఇంటి వద్దకు వెళ్లారు. ఈ క్రమంలో పోలీసులు-తెదేపా శ్రేణుల మధ్య తోపులాట జరిగింది. దీంతో ఉద్రిక్తత నెలకొంది.