రాజోలు జనసేన అభ్యర్థిని ఆ పార్టీ ఛీప్ పవన్ కళ్యాణ్ ప్రకటించారు. దీంతో ఎట్టకేలకు ఉత్కంఠకు తెరవీడింది రాజోలు జనసేన అభ్యర్ధి ప్రకటన. అంబేడ్కర్ కోనసీమ జిల్లా రాజోలు నియోజక వర్గంలో 2019 ఎన్నికల్లో గెలిచింది జనసేన. జనసేన, టీడీపీ, బీజేపీ పొత్తులో భాగంగా రాజోలు ఎమ్మెల్యే అభ్యర్థిగా మాజీ IAS దేవా వరప్రసాద్ ను ప్రకటించడంతో రాజోలు ఉత్కంఠకు తెరపడింది.
రాజోలు ఎమ్మెల్యే అభ్యర్థి మాజీ IAS దేవా వరప్రసాద్ స్వగ్రామం మలికిపురం మండలం దిండి గ్రామం. వైఎస్సార్సీపీ పార్టీలో రెండు సార్లు ఓడి పోయి జనసేన పార్టీలో చేరిన బొంతు రాజేశ్వరరావు నిన్నటివరకు టికెట్ వస్తుందని ఆశించారు. కానీ రాజోలు ఎమ్మెల్యే అభ్యర్థిగా మాజీ ఐఏఎస్ దేవా వరప్రసాద్ ను ప్రకటించారు పవన్ కళ్యాణ్. దీంతో బొంతు వర్గం నిరాశలో ఉంది.