ఏపీ రాష్ట్ర రైతులకు సీఎం జగన్మోహన్ రెడ్డి అదిరిపోయే శుభవార్త చెప్పారు. రేపు రైతులకు ఖాతాలలో డబ్బులు జమ చేయనున్నారు. ప్రకృతి విపత్తుల వల్ల పంటలు కోల్పోయిన రైతులకు ఇన్పుట్ సబ్సిడీ… అందించేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు పంట నష్టపోయిన రైతుల జాబితాను వ్యవసాయ శాఖ సిద్ధం చేసింది.
ఇందులో భాగంగానే ఈనెల ఆరో తేదీన అంటే రేపు తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయం నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కంప్యూటర్ బటన్ నొక్కి రైతుల ఖాతాలలో నగదు జమ చేయనున్నారు. 2023 ఖరీఫ్ సీజన్ లో సాగునీటి కరువు ఏర్పడి పంటలు కోల్పోయిన రైతులతో పాటు 2023 నుంచి 2024 రబీ సీజన్లో మీచాంగ్ తుఫాన్ వల్ల నష్టపోయిన రైతులను గుర్తించి నష్టపరిహారం అందించనున్నారు. విపత్తు బాధిత రైతులకు పరిహారం కింద 11.59 లక్షల మందితో జాబితా సిద్ధం అయింది. వారి కోసం రూ.1294 కోట్లు ఇన్పుట్ సబ్సిడీ రైతుల ఖాతాల్లో జమ చేయనున్నారు సీఎం జగన్.