సోమిరెడ్డికి టికెట్ ఇవ్వడం సంతోషం..4వ సారి ఓడిస్తానని మంత్రి కాకాణి సవాల్ చేశారు. టీడీపీ రెండు జాబితాల్లో సోమిరెడ్డికి చోటు దక్కలేదు. సీనియర్ నేత అని చెప్పుకొనే సోమిరెడ్డికి టికెట్ రావడంతో టపాసులు కాల్చి సంబరాలు చేసుకున్నారన్నారు. సోమిరెడ్డికి టికెట్ ఇవ్వకుంటే నేను కూడా ఎన్నికల్లో ఎవరిపై మాట్లాడాలా.. అని అనుకున్నానని సెటైర్లు పేల్చారు. కొత్త వాళ్ళైతే విమర్శలు చేయడం కష్టమని. ఇక నా ఎన్నికల ప్రసంగాలు కూడా రంజుగా ఉంటాయని చురకలు అంటించారు.
చివరి ఎన్నిక అని సోమిరెడ్డి చెబుతున్నారు…అంటే ఓటు వేస్తే వేయండి. లేకుంటే లేదని అంటున్నారని సెటైర్లు పేల్చారు. ఆయనను ఎన్నికల్లో ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నానని ప్రకటించారు. రాజకీయంగా పరిణితి చెందిన సోమిరెడ్డి.. జిల్లా అధికారులపై తీవ్ర విమర్శలు చేయడం సరికాదు. సైదాపురం లో అక్రమ గనుల తవ్వకాల పై ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేస్తాన్నారన్నారు. దమ్ముంటే సి.బి.ఐ. విచారణ కోరాలని వెల్లడించారు. సైదాపురంలో గనుల యజమానుల వద్ద సోమిరెడ్డి ముడుపులు తీసుకున్నారు…పొదలకూరు లో 500.కోట్ల విలువైన తెల్లరాయి ని తవ్వి స్టాక్ చేసారని సోమిరెడ్డి ఆరోపించారని ఫైర్ అయ్యారు.