Election Updates: RRR కు దక్కని టికెట్… బీజేపీ వెనుక జగన్ వ్యూహం..?

Election Updates: RRR did not get the ticket... Jagan's strategy behind BJP..?
Election Updates: RRR did not get the ticket... Jagan's strategy behind BJP..?

దేశ వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో తాజాగా BJP 5వ జాబితాను విడుదల చేసింది. ఎన్నికలు దగ్గర పడుతుండటంతో BJP మరోసారి అధికారంలోకి రావాలనే లక్ష్యంతో ప్రచారంలో దూసుకెళ్తోంది 400 సీట్లు గెలుపే లక్ష్యంగా ముందుకు వెళ్తోంది. తాజాగా 111 మందితో 5వ జాబితా విడుదల చేశారు.

తాజాగా BJP విడుదల చేసిన లిస్ట్ ఏపీ, తెలంగాణకి చెందిన అభ్యర్థులు కూడా ఉన్నారు. తెలంగాణలో ఖమ్మం, వరంగల్ తో పాటు ఏపీలో 6గురు అభ్యర్థులు ఉన్నారు. అరకు-కొత్తపల్లి గీత, రాజంపేట-కిరణ్ కుమార్ రెడ్డి, రాజమండ్రి-పురంధేశ్వరి, అనకాపల్లి-సీఎం రమేష్, తిరుపతి-వరప్రసాద్, నరసాపురం- శ్రీనివాస్ శర్మ.. ఖమ్మం పార్లమెంట్ నుంచి తాండ్ర వినోద్ రావు, వరంగల్ నుంచి ఆరూరి రమేష్ పోటీ చేయనున్నారు. ఇదిలా ఉంటే..నరసాపురం ఎంపీ టికెట్‌ రఘురామరాజుకు వస్తుందని అందరూ అనుకున్నారు. కానీ..చివరికీ ఆయనకు ఇవ్వకుండా..శ్రీనివాస్ శర్మకు ఇచ్చారు. దీంతో రఘురామకు నిరాశ ఎదురైంది.