తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు వారం రోజుల సమయం కూడా లేదు. ఈ నేపథ్యంలో BRS పార్టీకి బిగ్ షాక్ తగిలింది. భారత రాష్ట్ర సమితి పార్టీకి చెందిన ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళనున్నారు. జోగులాంబ గద్వాల జిల్లాలోని అలంపూర్ ఎమ్మెల్యే అబ్రహం ఇవాళ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు.
రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకొనున్నారు అబ్రహం. వాస్తవానికి అలంపూర్ ఎమ్మెల్యే టికెట్ మొదట అబ్రహంకు సీఎం కేసీఆర్ ఇచ్చారు. కానీ బీఫామ్ మాత్రం విజేయుడు అనే వ్యక్తికి సీఎం కేసీఆర్ ఇచ్చారు. దీంతో అబ్రహం అప్పటి నుంచి అసంతృప్తితో ఉన్నారు. ఇక ఇవాళ కాంగ్రెస్ పార్టీలో అబ్రహం చేరనున్నారు. కాగా.. కాంగ్రెస్ పార్టీ తరఫున అలంపూర్ నియోజక వర్గం నుంచి సంపత్ పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే.