త్వరలో దేశవ్యాప్తంగా పార్లమెంటు, అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఆయా పార్టీలు పార్లమెంట్ స్థానానికి సంబంధించిన అభ్యర్థులను ప్రకటిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలి తొలి జాబితాను పొత్తులో భాగంగా టీడీపీ, జనసేన, బీజేపి ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా రాబోయే లోక్సభ, అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే వైసీపీ అభ్యర్థులను సీఎం జగన్ ప్రకటించారు. మొత్తం 175 నియోజకవర్గాలతో పాటు 25 ఎంపీ సీట్లలో పోటీ చేయబోయే అభ్యర్థుల పేర్లను ప్రకటించారు.ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో నలుగురు మాజీ ముఖ్యమంత్రుల తనయులు పోటీలో దిగనున్నారు.
YSR తనయుడు, ప్రస్తుత సీఎం జగన్ పులివెందుల నుంచి తిరిగి బరిలోకి దిగుతున్నారు. ఇక కోట్ల విజయ భాస్కర్ రెడ్డి కుమారుడు సూర్యప్రకాశ్ (తెలుగుదేశం పార్టీ) డోన్ నుంచి పోటీ చేయనున్నారు. అటు సీనియర్ ఎన్టీఆర్ తనయుడు బాలకృష్ణ (టీడీపీ) హిందూపురం, చంద్రబాబు వారసుడు లోకేశ్ (టీడీపీ) మంగళగిరి, నాదెండ్ల భాస్కర్ రావు కుమారుడు మనోహర్ (జనసేన) తెనాలి నుంచి పోటీలో ఉన్నారు.