Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
నేటి రాజకీయాల్లో నీతి , నిజాయితీలకు మారు పేరు. ఆస్తుల మీద ధ్యాస లేని నాయకుడు ఎవరైనా ఉన్నారా ? ఉంటే ఎవరు ? ఆ ప్రశ్నలకు త్వరలో తిరుమల ఏడుకొండలవాడే సమాధానం చెప్పబోతున్నాడంట. ఇదంతా నిజమేనా అని అడగబోతున్నారా ? ఈ ప్రశ్నకు సమాధానం చెప్పాల్సింది ఆ దేవదేవుడు కాదు. మాజీ ఎంపీ చింతా మోహన్. శ్రీవారిని దర్శించుకున్న చింతా మోహన్ ఓ ఆసక్తికరమైన ప్రకటన చేశారు.
“ నీతి, నిజాయితీ కలిగి ఆస్తులపై ఆసక్తి లేని వారిని ఆంధ్రప్రదేశ్ కి ముఖ్యమంత్రిని చేయమని ఆ ఏడుకొండలవాడిని అడిగా. త్వరలో ఆ కోరిక తీరబోతోంది. అలాంటి నాయకుడు వస్తాడు. అందరికీ కనబడతాడు. రాష్ట్ర రాజకీయాల్లో పెను మార్పులు రాబోతున్నాయి. “ అని చింతా మోహన్ చేసిన కామెంట్స్ ఇంటరెస్టింగ్ గా వున్నాయి. అయితే కాంగ్రెస్ కుదేలైన ఈ పరిస్థితుల్లో ఆ పార్టీ నాయకుడు చింతా మోహన్ ఈ కామెంట్స్ ఎవరిని ఉద్దేశించి చేసాడు అన్నది మాత్రం ఊహకు కూడా అందడం లేదు. ఏడుకొండలవాడు ఏపీ కి ప్రసాదించే ఆ కొత్త ముఖ్యమంత్రి గురించి చింతా ఓ చిన్న క్లూ అన్నా ఇస్తే బాగుండేది.